ఎన్టీఆర్ ల‌వ‌ర్‌కు కొడుకు పుట్టాడు

టాలీవుడ్‌లో ద‌శాబ్దంన్న‌ర క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప‌లు హిట్ సినిమాల్లో న‌టించిన ఓ సీనియ‌ర్ హీరోయిన్ తాజాగా త‌ల్లి అయ్యింది. హీరోయిన్ అంకిత అన‌గానే మ‌న‌కు లాహిరి లాహిరి లాహిరి సినిమాతో పాటు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. హాట్ హాట్ హీరోయిన్‌గా ఆమె అప్ప‌ట్లో ఓ ఊపు ఊపింది. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్‌ను బుట్ట‌లో పెట్టేందుకు వేసిన ఎత్తులు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేరు.

లాహిరి లాహిరి లాహిరిలో – సింహాద్రి – ప్రేమలో పావని కళ్యాణ్ – ధనలక్ష్మీ ఐ లవ్ యూ –  విజయేంద్రవర్మ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత సినిమాలు మానేసిన అంకిత న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్‌ జగ్తాప్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత అంకిత అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.2016లో పెళ్లి చేసుకున్న అంకిత తాజాగా ఆదివారం ఓ అబ్బాయికి జ‌న్మ‌నిచ్చింది.