త‌మిళ‌నాడులో ‘ జై ల‌వ‌కుశ ‘ వ‌సూళ్ల సునామి… ఎన్టీఆర్ కొత్త రికార్డు

September 26, 2017 at 11:50 am
ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ వ‌సూళ్ల సునామీతో ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో నాన్ బాహుబ‌లి సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా త‌మిళ‌నాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల తెలుగు సినిమాలు త‌మిళ‌నాడులో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో జై ల‌వ‌కుశ‌ను కూడా అక్క‌డ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డంతో పాటు అంతే స్థాయిలో ప్ర‌మోష‌న్లు కూడా చేప‌ట్టారు.

ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమానే అతి పెద్ద తమిళ రిలీజ్. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో పాటు అక్క‌డ ప్ర‌మోష‌న్లు బాగా చేయ‌డం, ఎన్టీఆర్ విల‌న్ రోల్ అద‌ర‌గొట్టేయ‌డంతో వసూళ్ల ఫలితాలు బాగానే వచ్చాయి. మొదటి రోజు తమిళనాడు వ్యాప్తంగా రూ.72 లక్షల గ్రాస్ చేసి రెండవ రోజుకు రూ.1.1 కోట్లను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం ఆదివారం నాటికి దాదాపు రూ.2.12 కోట్ల గ్రాస్ నమోదుచేసింది. 

ఎన్టీఆర్ కు తమిళనాడులో ఇవే ఉత్తమమైన కలెక్షన్స్ కావడం విశేషం. ఎన్టీఆర్ సినిమాకు అక్క‌డ నాలుగు రోజుల‌కే రూ 2.12 కోట్ల గ్రాస్ అంటే మామూలు విష‌యం కాదు. గ‌తంలో ఎంతోమంది పెద్ద హీరోల సినిమాలు ఇక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యి అక్క‌డ రిలీజ్ అయ్యి అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి. అయితే జై ల‌వ‌కుశ మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. లాంగ్ ర‌న్‌లో ఈ వ‌సూళ్లు భారీగా ఉండ‌నున్నాయి.

త‌మిళ‌నాడులో ‘ జై ల‌వ‌కుశ ‘ వ‌సూళ్ల సునామి… ఎన్టీఆర్ కొత్త రికార్డు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share