“ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు” ఫ‌స్ట్ డే కలెక్షన్స్

February 23, 2019 at 11:46 am

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంలో బోల్తా కొట్టింది. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేసినా.. జ‌న‌హృద‌యాల‌ను చేరుకోలేక‌పోయింది. అయితే.. అంద‌రి దృష్టి రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుపై ప‌డింది. అయితే.. క‌థానాయ‌కుడు బోల్తా కొట్ట‌డంతో ద‌ర్శ‌కుడు క్రిష్‌, హీరో బాల‌య్య తీవ్ర ఒత్తిడిలో రెండో భాగంలో చిన్న‌చిన్న మార్పులు చేశారు. ఈ క్ర‌మంలోనే విడుద‌ల తేదీల‌ను మార్చుతూ వ‌చ్చారు.

ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం నాడు ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ సినిమా కొంత పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు కంటే.. మ‌హానాయ‌కుడు న‌య‌మ‌నే టాక్ వ‌స్తోంది. ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య‌, బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వారి పాత్ర‌ల‌కు బాల‌య్య‌, విద్యాబాల‌న్ ప్రాణం పోశార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక చంద్ర‌బాబు పాత్ర‌లో రానా మెప్పించార‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నాయి. మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుకోవ‌డంతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పెరుగుతోంది. మొద‌టి రోజు ఏపీ, తెలంగాణ క‌లిపి మొత్తం రూ. 6.83కోట్లు ఈ సినిమా వ‌సూలు చేసింది. ఇది వీకెండ్ కావ‌డంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీంతో ముందుముందు వసూళ్లు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నాయి.

మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.
నిజాం.. రూ. 1.62కోట్లు
సీడెడ్ రూ. 0.70కోట్లు
వైజాగ్ రూ. 0.75కోట్లు
ఈస్ట్ రూ. 0.45కోట్లు
నెల్లూరు రూ. 0.32కోట్లు
వెస్ట్ రూ. 0.65కోట్లు
గుంటూరు రూ. 2.4కోట్లు
కృష్ణా రూ. 0.86కోట్లు

ఏపీ తెలంగాణ మొత్తం రూ. 6.83కోట్లు

“ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు” ఫ‌స్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share