“ఎన్టీఆర్ మహానాయకుడు” ట్రైలర్ …నేను రాజకీయాలు చేయటానికి రాలేదు

February 16, 2019 at 6:11 pm

ఎన్టీయార్ బ‌యో పిక్ రెండో భాగం మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్ విడుద‌లైంది. ఎన్టీయార్ అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న మ‌హా చిత్రం ఎలా ఉండ‌బోతోందో ట్రైల‌ర్‌లో అద్భుతంగా చూపించారు. ముఖ్య‌మంత్రిగా ఎన్టీయార్ జీవిత విశేషాలు, రాజ‌కీయాల్లో గెలుపోట‌ముల అనుభ‌వాల‌ను మ‌హాద్భుతంగా చూపించారు. *నిశ్శ‌బ్దాన్ని చేత‌గాని త‌నం అనుకోవ‌ద్దు.. మౌనం మార‌ణాయుధంతో స‌మాన‌మ‌ని మ‌ర్చిపోవద్ద‌నే* డైలాగ్ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ట్రైల‌ర్ చివ‌ర‌లో *నేను రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేదు.. మీ గ‌డ‌ప‌ల‌కు ప‌సుపునై బ‌త‌క‌డానికి వ‌చ్చాను* అనే డైలాగ్ మ‌రింత అద్భుతంగా ఉంది. రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న సినిమాలో బాల‌య్య క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో సుమంత్‌, ద‌గ్గుబాటి రాణా, క‌ల్యాన్‌రామ్‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ న‌టించారు.DzdOk8YVYAEsVJx

పూర్తిగా ఎన్టీయార్ చ‌రిత్ర ఇతి వ్రుత్తంగా రూపొందించిన ఈ రెండు భాగాల్లో నందమూరి పూర్తి జీవితాన్ని చూపించారు ద‌ర్శ‌కుడు క్రిష్‌. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు క‌థావ‌స్తువు పూర్తిగా భిన్నంగా ఉండేలా ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. క‌థానాయ‌కుడు కొంత నిరాశ ప‌ర్చినా మ‌హానాయ‌య‌కుడు మంచి టాక్ సంపాదించుకునే విధంగా ఉంది ట్రైల‌ర్ చూస్తే. మొత్తంగా సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతాలు మ‌రింత హైలైట్‌గా నిలువ‌నున్నాయి.

“ఎన్టీఆర్ మహానాయకుడు” ట్రైలర్ …నేను రాజకీయాలు చేయటానికి రాలేదు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share