ఇదేనా “ఎన్టీఆర్” కు ఘనమైన నివాళి ?

February 21, 2019 at 12:16 pm

మంచో చెడో, సంతోషమో దుఃఖ‌మో చూపే బొమ్మ‌ల ఆటే సినిమా. గ‌తంలో కుటుంబ క‌థ‌లొచ్చాయి.. రాజుల క‌థ‌లొచ్చాయి.. నీతి క‌థ‌ల‌తో కూడిన సినిమాలు వ‌చ్చాయి.. సాహ‌స దృశ్యాలను క‌ళ్ల‌కు క‌ట్టి చూపించే సినిమాలు వ‌చ్చాయి.. మ‌రికొద్ది కాలానికి వాస్త‌వ ఘ‌ట‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టినట్టు చూపించే సినిమాలు కూడా వ‌చ్చాయి.. ఏదీ చేసిన ప్ర‌జ‌ల‌కు ఓ జ్ఞాప‌కంగా మిగిల్చే ప‌ని చేయ‌డ‌మే త‌ప్ప క‌నిక‌ట్టు క‌ట్టే క‌థా వ‌స్తువు దాదాపు ఏదీ ఉండ‌దు. ఒక వేళ అలాంటి క‌థా వ‌స్తువును ఎవ‌రైనా ఎన్నుకుని తీసిన సినిమా దాదాపు ఆడింది త‌క్కువ‌నే చెప్పొచ్చు. మొత్తంగా సినిమా అంటే ఓ సందేశ‌మో, ఓ సంక‌ల్పంతోనే తీసేదే త‌ప్ప జిమ్మిక్కులు చేసే ప్ర‌యోగ శాల ఏమీ కాదు..52358900_1899242530203342_5940723808057950208_n

ఇప్పుడు ఎన్టీయార్ బ‌యో పిక్” మ‌హానాయ‌కుడు” పై కూడా భారీగా అంచ‌నాలు పెరిగాయి. మొద‌టి భాగం” ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు” అందరిచేత ప్రశంసలు అందుకొంది, కానీ ఇంకా ఊహించ‌నంత దూరం వెళ్ల‌లేక‌పోయింది. దానికి ద‌ర్శ‌కుడినో, న‌టీన‌టుల‌నో, సాంకేతిక నిపుణుల‌తో ఏ ఒక్క‌రినో అనాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రైనా మంచి క‌థ‌తో బాగా తీయాల‌నే చూస్తారు త‌ప్ప ఫ్లాప్ కావాల‌నో , న‌ష్టం తేవాల‌నో చూడ‌రు. మొద‌టి భాగంలో ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి అద్భుతంగానే తెర‌కెక్కించారు.ఎన్టీఆర్ జీవితంలో చూసికుంటే పొలిటికల్ ఎంట్రీ వరకు సినీ జీవితం సాపిగా సాగింది , దానినే క్రిష్ అద్భుతంగా తెరక్కించారు కానీ, కొన్ని వ‌ర్గాల‌ను మెప్పించ‌లేద‌నుకోవాలో, లేక కొంత మూడిగా అనిపించేలా ఉంద‌నుకోవాలో తెలియ‌దు కానీ సినిమా కాస్త నిరాశ ప‌రిచిన మాట మాత్రం వాస్తవం.

దానికే ఢీలా ప‌డిపోయి అనుకున్న మ‌రో ప్రాజెక్టును మ‌ధ్య‌లోనే వ‌ద‌లుకోక ప్ర‌య‌త్నం చేశారు. ప‌నిని పూర్తి చేశారు. అందులో భాగంగా రెండో భాగం విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీయార్ జీవిత చ‌రిత్ర రెండో భాగం *ఎన్టీఆర్ మహానాయకుడు* తెర‌కెక్కించారు. మొద‌టి విడ‌త మిగిల్చిన అసంత్రుప్తిని ఏ మాత్రం లెక్క చేయ‌క‌, బ‌య్య‌ర్ల‌కు ఏ మాత్రం అధైర్యం క‌లిగించ‌కుండా క‌థ‌ను సంపూర్ణంగా తెర‌పైకి తీసుకొచ్చారు. అయితే మొద‌టి దానిని ఆధారంగా చూపి రెండో భాగాన్ని త‌క్కువ చేసి చూడ‌డం త‌ప్ప‌కుండా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. ఓట‌మి నుంచే పాఠాలు నేర్చుకోవ‌డం మ‌నిషికి దేవుడిచ్చిన గొప్ప వ‌రం. మొద‌ట ఎక్కడెక్క‌డైతే పొర‌పాట్లు జ‌రిగాయ‌య‌ని అనిపించిందో వాటిని బేరీజు వేసుకుని రెండో భాగంలో జాగ్ర‌త్త ప‌డుతాడ‌ని అనుకోవ‌చ్చుక‌దా.. అలా కాకుండా మొద‌టి దానిని సాకుగా చూపి రెండో భాగంపై ప్రేలాప‌న‌లు పేల‌డం నిజంగా తెలివి త‌క్కువ త‌నం. దేని దారి దానే అన్న‌ట్టుగా క్రిష్ ఈ విష‌యంలో మ‌రింత జాగ్రత్త వ‌హించి ప‌రిపూర్ణంగా తెర‌పైన ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం ముమ్మాటికి చేసే ఉంటాడు. అంతే కాని విడుద‌లైన ట్రైల‌ర్‌ను ప‌ట్టుకుని ఎడా పెడా చేతిలో అస్ర్తం ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా సోష‌ల్ మీడియా ఉంది కాదా అని అడ్డ‌మైన పోస్టులు చేస్తూ క‌ళాకారుల‌ను, క‌ళ‌ను అవ‌మాన ప‌ర్చ‌డం ఏమాత్రం స‌బబు కాదు. మ‌నం చేసే ప‌ని నలుగురికి ఉప‌యోగ‌ప‌డ‌క‌పోయిన ప‌ర్వాలేదు కానీ నిరుత్సాహ‌ప‌రిచేలా మాత్రం ఉండ‌కుంటే బాగుంట‌ది.

ఏది ఏమైనా ఊహించి చెప్పిన‌వ‌న్నీ స‌క్సెస్ కావు, ఊహించ‌నంత మాత్ర‌మా ఫ్లాఫ్‌లు కావు. జ‌నం కోర్టులో దేని స‌త్తా ఏమిటో అదే తేల్చుకుంటుంది. అప్పుడువరకు న‌చ్చితే మంచిగా చెప్పండి, లేదంటే మానుకోండి అంతేకానీ ఇష్టారీతిగా ఏది ప‌డితే అది రాస్తూ ఒక‌రి పొట్ట‌కొట్ట‌కుండా ఉంటే అంద‌రికీ మంచిది. ఏదిఏమైనా నాడు రాజకీయ కుట్ర చదరంగంలో బలైపోయిన “ఎన్టీఆర్ ” – నేడు అదే రాజకీయ కుట్ర చదరంగంలో ” ఎన్టీఆర్ ” బలైపోవటం భాదాకరం.

ఇదేనా “ఎన్టీఆర్” కు ఘనమైన నివాళి ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share