ఎన్టీఆర్ సినిమా… త్రివిక్ర‌మ్ మార్పు ..!

April 25, 2018 at 10:58 am
ntr-trivikram

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే టోట‌ల్ ఇండ‌స్ట్రీలో ఎక్క‌డా లేని క్రేజ్ నెల‌కొంది. ఈ సినిమా గ‌త యేడాది చివ‌ర్లో డిసెంబ‌ర్ నెల‌లోనే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా రావ‌డంతో ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చింది. అయితే జ‌న‌వ‌రిలో రిలీజ్ అయిన ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి ఎంత పెద్ద డిజాస్ట‌ర్ అయ్యిందో చూశాక జ‌నాల‌కు ఈ క్రేజీ ప్రాజెక్టుపై కాస్త క్రేజ్ త‌గ్గింద‌నే చెప్పాలి.

 

త్రివిక్ర‌మ్ పెన్ను ప‌దును అత్తారింటికి దారేది నుంచి త‌గ్గుతూనే వ‌స్తోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, ఆ…ఆలో త్రివిక్ర‌మ్ మ్యాజిక్ పని చేయ‌లేదు. అయితే వాటికి టైం క‌లిసొచ్చి హిట్ అయ్యాయి. ఇక అజ్ఞాత‌వాసి సినిమా చూశాక త్రివిక్ర‌మ్ నెగ్ల‌జ‌న్సీ స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. చాలా మందికి త్రివిక్ర‌మ్ సామ‌ర్థ్యం మీద సందేహాలు కూడా క‌లిగాయి. అయితే గ‌తంలో కూడా దెబ్బ‌తిన్న ప్ర‌తిసారి వెంట‌నే బంప‌ర్ హిట్ ఇచ్చిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం క‌సిమీద ప‌ని చేస్తున్నాడు.

 

స్క్రిఫ్ట్ వ‌ర్క్ కంప్లీట్ చేసేందుకే నాలుగు నెల‌ల‌కు పైగా టైం తీసుకున్నారు. ఇక త్రివిక్ర‌మ్ అంటే యాక్ష‌న్ క‌న్నా ఎక్కువుగా ఫ్యామిలీ పార్ట్ ఉంటుంది. ఎక్కువుగా క్లాస్ ట‌చ్‌లోనే సినిమా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యామిలీ, ఎమోష‌న‌ల్‌, కామెడీతో పాటు యాక్ష‌న్ పార్టు చాలా ఎక్కువ‌గానే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. ఇది త్రివిక్ర‌మ్‌లో పెద్ద మార్పు.

 

త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎక్కువుగా యాక్ష‌న్ న‌మ్ముకోవ‌డం ఏంటి ? త‌్రివిక్ర‌మ్‌లో ఈ మార్పు ఏంట‌ని ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ముందుగా హెవీ ఫైట్ సీన్లే షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త లుక్‌తో ద‌ర్శ‌న‌మిస్తోన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమా… త్రివిక్ర‌మ్ మార్పు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share