పైసా వసూల్ TJ రివ్యూ

TJ రివ్యూ: పైసా వ‌సూల్‌

జాన‌ర్‌: యాక్ష‌న్ డ్రామా

బ్యాన‌ర్‌: భ‌వ్య క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియా శ‌ర‌ణ్‌, మ‌స్కాన్ సేథీ, కైరాద‌త్‌

మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌

సినిమాటోగ్ర‌ఫీ: జి.ముఖేష్‌

ఎడిటింగ్‌: జునైద్ సిద్ధిఖి

స‌హ‌నిర్మాత‌: అన్నే ర‌వి

నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం: పూరీ జ‌గ‌న్నాథ్‌

సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ

ర‌న్ టైం: 142 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 01 సెప్టెంబ‌ర్‌, 2017

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఈ యేడాది సంక్రాంతికి త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టాడు. శాత‌క‌ర్ణి త‌ర్వాత చాలా త‌క్కువ టైంలోనే మ‌రోసారి పైసా వ‌సూల్ సినిమాతో రెడీ అయిపోయాడు. స్టార్ హీరోల‌కు వరుస హిట్లు ఇచ్చి ఇటీవ‌ల వ‌రుస ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతోన్న పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆస‌క్తి రేపడంతో ఈ సినిమ‌పై అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఈ సినిమా ఆ అంచ‌నాలు అందుకుందో ? లేదో ? TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

పోర్చుగ‌ల్‌లో ఉండి ప్ర‌పంచాన్ని శాసించే మాఫియా లీడ‌ర్ బాబ్‌మార్లే (విక్ర‌మ్‌జీత్‌). అత‌డు ఇండియా మినిస్ట‌ర్ సాయంతో ఇక్క‌డ కూడా బాంబ్ బ్లాస్ట్‌లు చేస్తూ ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తుంటాడు. మినిస్ట‌ర్ అండ ఉండ‌డంతో ఇండియాలో కూడా ఓ మినిస్ట‌ర్‌తో పాటు సామాన్య జ‌నాల‌ను, పోలీసుల‌ను కూడా బ్లాస్ట్‌ల‌తో చంపేస్తుంటాడు. ఇత‌డిని ప‌ట్టుకోవ‌డం పోలీసుల వ‌ల్ల కాక వాళ్లు ఓ నీచ్ క‌మిన్ కుత్తే, ఖ‌ర‌త్నాక్ కోసం అన్వేషిస్తుంటారు. వీరికి తేడా సింగ్ (బాల‌య్య‌) దొరుకుతాడు. బాల‌య్య‌తో వీళ్లు బాబ్ మార్లే గ్యాంగ్‌ను ఎటాక్ చేయిస్తుంటారు. ఈ టైంలో వీరికి ఈ తేడాసింగ్ వెన‌క ఉన్న పెద్ద హిస్ట‌రీ తెలుస్తుంది. ఈ తేడాసింగ్‌కు పోర్చుగ‌ల్‌లో కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేసే బాలు (బాల‌య్య‌)కు లింక్ ఏంటి ? మ‌ధ్య‌లో కిర‌ణ్మ‌యి (కైరా ద‌త్‌), బీబీసీ జ‌ర్న‌లిస్టు సారిక (శ్రియా), హారిక (మ‌స్కాన్ సేథి)కి ఈ తేడాసింగ్‌, బాలుల‌తో ఉన్న సంబంధం ఏంటి ? మ‌రి బాబ్ మార్లేను వేటాడే క్ర‌మంలో తేడాసింగ్ ఏం కోల్పోయాడు ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ :

సినిమాలు హిట్స్ కావచ్చు లేక్ ఫ్లాప్ కావచ్చు. కాని నటన పరంగా బాలకృష్ణ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఈ సినిమాలో కూడా బాల‌య్య త‌న ఫుల్ ఎనర్జీతో చెప్పిన డైలాగులు, యాక్ష‌న్‌, కొత్త లుక్స్‌, మేన‌రిజ‌మ్స్‌తో అల‌రించాడు. బాల‌య్య స్టెప్పులు కూడా కొత్త‌గానే ఉన్నాయి. తేడాసింగ్‌గా బాల‌య్య క్యారెక్ట‌ర్ అదిరిపోయింది. బాల‌య్య‌ ఇప్పటి వరకూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు కూడా. పేరుకి తగ్గట్టుగానే తేడా తేడాగా నటిస్తూ ఇర‌గ‌దీశాడు.

ఇక ఏసీపీగా కైరా ద‌త్‌, బీబీసీ అండ‌ర్ క‌వ‌ర్ ఆఫ‌రేష‌న్ జ‌ర్న‌లిస్టుగా శ్రియా, శ్రియా చెల్లిగా మ‌స్కాన్ సేథి త‌మ పాత్ర‌ల వ‌ర‌కు న్యాయం చేశారు. హీరోయిన్లు ముగ్గురికి స్క్రీన్ మీద షేరింగ్ ఉండ‌డంతో ఎవ్వ‌రి పాత్ర పెద్ద‌గా హైలెట్ కాలేదు. ఉన్నంత‌లో శ్రియా మాత్ర‌మే సెకండాఫ్‌లో కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించింది. ఇక ప్ర‌ధాన విల‌న్‌గా విక్రం జీత్‌కు పెద్ద‌గా న‌ట‌న‌కు స్కోప్ లేదు. ఇక క‌బీర్‌బేడీ, మంత్రిగా రోల్ చేసిన పాత్ర‌లు ఓకే. ఆలీ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఇక బాల‌య్య సినిమాలో డైలాగ్స్‌, హావ‌భావాలు, స్టెప్పుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను అనుక‌రించిన తీరు బాగుంది. ఇక ఎన్టీఆర్ జీవిత చక్రం సినిమాలోని ‘కంటిచూపు చెబుతోంది’ పాటలో బాల‌య్య తండ్రిలా వేసిన స్టెప్పులు బాగున్నాయి.

సినిమా స్టార్టింగ్‌తోనే మెయిన్ ట్రాక్‌లోకి ఎంట‌ర్ అయిన పూరీ ఫ‌స్టాఫ్‌లో కైరా ద‌త్‌తో స్పెష‌ల్ సాంగ్‌, తేడా సింగ్ రోల్‌ను ఎలివేట్ చేయ‌డం, మ‌స్కాన్‌తో ప్రేమ వ్య‌వ‌హారాలు, బాబ్‌మార్లీ గ్యాంగ్‌తో బాల‌య్య ఫైట్ సీన్ల‌తో సినిమాను న‌డిపించాడు. ఓవ‌రాల్‌గా సినిమాలో కొత్త బాల‌య్య‌ను చూస్తాం. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో మ‌స్కాన్‌ను కాపాడేందుకు వెళ్లిన బాల‌య్య‌నే మ‌స్కాన్ కాల్చివేసే ట్విస్ట్ బాగుంది. ఫ‌స్టాఫ్ మొత్తం కామెడీ, బాల‌య్య మేన‌రిజ‌మ్స్‌తో కాస్త జోష్‌తోనే ముందుకు వెళ్లింది.

ఇక సెకండాఫ్‌లో పోర్చుగ‌ల్‌లో స్టోరీ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి సినిమా డ్రాఫ్ అవుతూ అధః పాతాళానికి ప‌డిపోతుంది. అస్స‌లు ఏ మాత్రం ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న సీన్లు లేవు. పేల‌వ‌మైన క్లైమాక్స్‌, పోకిరి స్టైల్లో ఓ సీక్రెట్ రివీల్ చేసినా అది తుస్సుమంది. కేవ‌లం క‌థ‌ను వ‌దిలేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేసి స‌క్సెస్ కొట్టాల‌నుకున్న పూరీ బొక్క బోర్లా ప‌డ్డాడు.

కాస్త‌లో కాస్త బెట‌ర్ ఏంటంటే పూరి గ‌త నాలుగు ప్లాప్ సినిమాల కంటే కాస్త బెట‌ర్ అని స‌రిపెట్టుకోవ‌డం ఒక్క‌టే పైసా వ‌సూల్‌కు ఉన్న ప్ల‌స్ పాయింట్‌.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

సాంకేతికంగా చూస్తే కూడా పైసా వ‌సూల్ మ‌రీ అంత గొప్ప‌గా లేదు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీలో అన్ని క్లోజ‌ప్ షార్ట్‌లే కావ‌డంతో పెద్ద క్రియేటివిటి ఉండ‌దు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అంతా పాత సినిమాల నుంచి కొట్టుకొచ్చిందే. ఆర్ట్ గురించి కొత్త‌గా చెప్పుకోలేం…పూరి పాత సినిమాల్లో చాలాసార్లు చూసేశాం. యాక్ష‌న్ పాత‌దే అయినా బాల‌య్య త‌న దైన స్టైల్లో కొత్త‌గా చూపించాడు. జునైద్ ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో ఉన్నంత క్రిస్పీ సెకండాఫ్‌లో లేదు. భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాణ విలువ‌లు జ‌స్ట్ ఓకే.

పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:

పూరీ గ‌త నాలుగు సినిమాల ప్లాప్‌తో ఈ సినిమాతో అయినా మార‌త‌డాని ఆశించిన వారికి పూర్తిగా మార‌లేదనే అనిపిస్తుంది. మ‌ళ్లీ రొటీన్ మాఫియా స్టోరీ, గ్యాంగ్‌స్ట‌ర్స్‌, ప్లాట్‌ నెరేష‌న్‌, క‌స‌ర‌త్తులేని స్క్రీన్ ప్లేతో సినిమా లాగేశాడు. పూరీ క‌థ‌, క‌థ‌నం, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ అన్ని పాత‌వే అయినా కేవ‌లం బాల‌య్య త‌న భుజ‌స్కంధాల మీద సినిమాను కొంత వ‌ర‌కు లాక్కువ‌చ్చాడు. పూరీ ఎప్ప‌ట‌కి మార‌తాడు ? అని ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలా ? అని టాలీవుడ్ జ‌నాలు బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– పూరీ స్టైల్లో బాల‌య్య న‌ట‌న‌

– పంచ్ డైలాగ్స్‌

– యాక్ష‌న్ సీన్లు

– ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌

– ఫ‌స్టాఫ్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– రొటీన్ స్టోరీ

– ఎంగేజింగ్‌గా లేని స్క్రీన్ ప్లే

– ప్లాట్‌ నెరేష‌న్‌

– మ్యూజిక్‌

– డైరెక్ష‌న్‌

– సెకండాఫ్‌

ఫైన‌ల్‌గా…

పూరి బెట‌ర్ ల‌క్ నెక్ట్స్ టైం

TJ ఫైన‌ల్ పంచ్: వ‌సూల్ ప్లాప్‌

TJ రేటింగ్-2.5/5