‘ పంతం ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌…

July 5, 2018 at 9:22 am
pantham-primior show talk

గోపీచంద్ కెరీర్‌లో 25వ సినిమాగా తెర‌కెక్కిన పంతం సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న గోపీచంద్ ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. గోపీకి కెరీర్‌లో 25వ సినిమాగా ల్యాండ్ మార్క్‌గా తెర‌కెక్క‌డం, మ‌నోడి కెరీర్‌లో వ‌చ్చిన హిట్ సినిమాల చివ‌ర్లో సున్నా టైటిల్ ఉండ‌డం… పంతం లోనే అదే సెంటిమెంట్ ఉండ‌డంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ల టాక్ ప్ర‌కారం పంతం ఎలా ఉందో ?  చూద్దాం.

 

విక్రాంత్ అనే రోల్ చేసిన గోపీచంద్ ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. ఈ వ‌రుస దొంగ‌త‌నాల నేప‌థ్యంలో ఈ కేసును చేధించ‌డం పోలీసుల‌కు పెద్ద స‌వాల్‌గా మారుతుంది. ఈ క్ర‌మంలోనే విక్రాంత్ మినిస్ట‌ర్ నాయ‌క్ (సంప‌త్‌) ఇంట్లో దొంగ‌త‌నం చేయ‌డంలో నాయ‌క్ విక్రాంత్‌ను టీంను ప‌ట్టుకుంటాడు. ఈ క్ర‌మంలోనే విక్రాంత్ గురించి పూర్తి నిజాలు తెలుసుకుని షాక్ అవుతాడు. అస‌లు విక్రాంత్ ఎవ‌రు ? అత‌డు రాజ‌కీయ నాయ‌కుల‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అన్న‌దే పంతం క‌థ‌.

 

ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తొలి సినిమా కావ‌డంతో ఎంచుకున్న క‌థ పాత‌గానే ఉన్నా మాంచి సోష‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి క‌థ‌నం న‌డిపించిన తీరు ఆక‌ట్టుకుంది. సెకండాఫ్లో కొన్ని సాగ‌దీత స‌న్నివేశాలు, హీరో – హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మ‌రీ అంత ఎఫెక్టివ్‌గా లేక‌పోవ‌డం, పాట‌లు అంతంత మాత్రంగానే ఉండ‌డం లాంటి మైన‌స్‌లు ఉన్నా సినిమాలో కామెడీ, ఫ‌స్టాఫ్‌, యాక్ష‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ, డైరెక్ష‌న్ లాంటి ప్ల‌స్‌లు సినిమాను యావ‌రేజ్ మార్క్ దాటించేసి పై మెట్టు ఎక్కించాయి.

 

గోపీచంద్ న‌ట‌న బాగుంది. హీరోయిన్ మెహ్రీన్ అందంగా ఉన్నా ఆమె పాత్ర కాస్త ప‌రిమిత‌మే. కామెడీయన్ పృథ్వి, శ్రీనివాస రెడ్డి, గోపీచంద్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. జయప్రకాష్ రెడ్డి కూడా తన పార్థలో నవ్వులు పూయించారు. ఇకపోతే నిర్మాత కేకె రాధా మోహన్ చిత్రాన్ని బాగా లావిష్ గా నిర్మించారు. రెగ్యుల‌ర్ ఫార్మాట్లో తెర‌కెక్కిన మంచి సోష‌ల్ మెసేజ్ ఉన్న పంతం ప‌ర్లేద‌నిపించుకున్నా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో ?  చూడాలి.

‘ పంతం ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share