‘పంతం’: రివ్యూ

July 5, 2018 at 1:08 pm
Pantham -Review

‘పంతం’: రివ్యూ

 

నటీనటులు: గోపీచంద్‌, మెహరీన్‌, పృథ్వీ, తనికెళ్ల భరణి, ‘మిర్చి’ సంపత్‌, జయప్రకాశ్‌, ముఖేశ్‌ రుషి, ప్రభాస్‌ శ్రీను, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు

 

సంగీతం: గోపీ సుందర్‌

 

సినిమాటోగ్రాఫర్‌: ప్రసాద్‌ మూరెళ్ల

 

నిర్మాత: కేకే రాధామోహన్‌

 

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.చక్రవర్తి

 

‘లౌక్యం’సినిమా తర్వాత మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న యాక్షన్ హీరో గోపి చంద్, మెహ్రిన్ జంటగా నటించిన ‘పంతం’ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి.  

 

కథ :

విక్రాంత్ (గోపీచంద్) అనే యువకుడు తన గ్యాంగ్ లతో కలిసి ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ వుంటాడు. అయితే వారు హోమ్ మినిస్టర్ నాయక్ (సంపత్) ఇంట్లో ఒక భారీ చోరీకి పాల్పడగా, ఘటనకు కారకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో గోపీచంద్ గ్యాంగ్ లోని కొందరు సభ్యులను నాయక్ పట్టుకుంటాడు. అయితే వారిని విడిపించడానికి విక్రాంత్ ఏం చేశాడు..విక్రాంత్ గురించి తెలుసుకున్న మంత్రి షాక్ అవుతాడు..అసలు విక్రాంత్ ఎవరు..పొలిటీషియన్స్ ఇళ్లలోనే ఎందుకు దొంగతనం చేస్తున్నాడు.. అసలు విక్రాంత్‌ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అన్నదే కథ.

 

విశ్లేషణ: 

 

గతంలో ఉన్నవాడిని దోచుకొని పేదవారికి పంచే హీరో కథలు ఎన్నో వచ్చాయి.  వీటికి మూలాధానం హాలీవుడ్ రాబిన్ హుడ్ కథ.  ఇక పంతం సినిమా విషయంలో కూడా ఇదే సారంశం కనిపిస్తుంది.   ఈ సినిమాను ఒక ఇంటెలిజెంట్‌ థ్రిల్లర్‌గా మలిచే అవకాశం ఉంది. దొంగతనాలు చేసే విధానం, పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భాలు, విలన్‌లను బురిడీ కొట్టించడాలు..ఇలాంటి సన్నివేశాల్లో తెలివితేటలు చూపించగలిగితే బాగుండేది. హీరో  డబ్బులు ఎత్తుకుపోవడం లాంటి సన్నివేశాలను కూడా చాలా రొటీన్‌ పద్ధతిలోనే తెరకెక్కించాడు.  హీరో, హీరోయిన్ల మద్య నడిచే ప్రేమ కథకి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోవడంతో వారి మధ్య నడిచే సన్నివేశాలు కూడా విసుగు తెప్పిస్తాయి. సెకండ్ ఆఫ్ లో దర్శకుడు తన ప్రతిభ చూపించాడనిపించది. విక్రాంత్‌ ఫ్లాష్‌బ్యాక్‌, తాను దొంగగా మారడానికి దారితీసిన పరిస్థితులు, అతని లక్ష్యం ఇవన్నీ సమంజసంగానే అనిపిస్తాయి. కోర్టు సన్నివేశాలు, పలికే సంభాషణలు ఆలోచనలో పడేస్తాయి. అవినీతి, లంచగొండితనం, ప్రభుత్వ పథకాలు అందవలసిన వారికి సరిగ్గా అందకపోవడం వంటి పాయింట్లపై గోపీచంద్‌ పలికిన సుదీర్ఘమైన సంభాషణలు రచయితగా దర్శకుడిలో ఉన్న ప్రతిభను చూపిస్తాయి.

 

సాంకేతిక విభాగం : 

 

 గోపీచంద్‌ నటన కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ద్వితీయార్థంలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. కోర్టు సన్నివేశాల్లో సుదీర్ఘమైన సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. మెహరీన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర దక్కింది. గోపీచంద్‌ పక్కన మరీ బొద్దుగా కనిపించింది. ‘మిర్చి’ సంపత్‌, జయప్రకాశ్‌, ముఖేశ్‌ రుషి, తనికెళ్ల భరణి ఇలా ఎవర్ని తీసుకున్నా వారి పాత్రలకు తగిన న్యాయం చేశాడు దర్శకుడు.నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. దర్శకుడు కొన్ని సన్నివేశాలను, డైలాగ్స్ అద్భుతంగా చిత్రీకరించారు. 

 

ప్లస్ పాయింట్స్ : కోర్టు సన్నివేశాలు,యాక్షన్‌ సీన్లు,పవర్ ఫుల్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ : టీన్‌ కథ, బోరింగ్ కామెడీ, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ

బాటమ్ లైన్ : గోపిచంద్ ‘పంతం’నెగ్గాడు

 

రేటింగ్ : 3.0/5

‘పంతం’: రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share