ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ రైట్స్‌… సీడెడ్ చీటి చిరిగిందోచ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప్లాపులు అవుతున్నా అత‌డి కొత్త సినిమాల మార్కెట్‌కు ఏ మాత్రం డోకా ఉండ‌దు. అది టాలీవుడ్‌లో ప‌వ‌న్ స‌త్తా. ఏ స్టార్ హీరోకు అయినా మూడు ప్లాపులు..అందులో రెండు పెద్ద డిజాస్ట‌ర్లు వ‌స్తే అత‌డి మార్కెట్ దారుణంగా ప‌డిపోతుంది. అయితే ప‌వ‌న్ మాత్రం ఇందుకు భిన్నం. అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత గోపాల‌..గోపాల లాంటి యావ‌రేజ్‌, కాట‌మ‌రాయుడు, స‌ర్దార్ లాంటి రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు వ‌చ్చినా ప‌వ‌న్ లేటెస్ట్ మూవీపై జ‌నాల్లోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను అస్స‌లు క్రేజ్ త‌గ్గ‌లేదు స‌రిక‌దా మ‌రింత పెరిగింది.

ప‌వ‌న్ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా 25వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రైట్స్ అన్ని ఏరియాల్లోను నాన్ బాహుబ‌లి సినిమాల రేట్ల‌ను బీట్ చేసేలా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నైజాం రైట్స్‌ను అగ్ర‌నిర్మాత దిల్ రాజు క‌నివినీ ఎరుగ‌ని రీతిలో ఏకంగా రూ.29 కోట్ల‌కు సొంతం చేసుకున్నాడు. స్పైడ‌ర్‌ను రూ.23 కోట్ల‌కు నైజాం రైట్స్ సొంతం చేసుకున్న రాజు ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా మ‌రో రూ.6 కోట్లు అద‌నంగా చెల్లించి మ‌రీ రైట్స్ ద‌క్కించుకున్నాడు.

ఇక సీడెడ్‌లో ఈ సినిమా ‘నాన్-బాహుబలి’ రికార్డ్‌ని నమోదు చేసుకుంది. గంగాధర్ – శివ ఇద్దరూ సంయుక్తంగా ఈ మూవీ సీడెడ్ రైట్స్‌ని అక్షరాల రూ.16.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. షాక్ ఏంటంటే సీడెడ్‌లో ప‌వ‌న్ న‌టించిన ఏ సినిమా కూడా రూ.15 కోట్ల మార్క్ టచ్ చేయ‌లేదు. ఇంకా చెప్పాలంటే రూ.12 కోట్ల మార్క్ కూడా ప‌వ‌న్‌కు సీడెడ్‌లో లేదు. అయితే ఈ సినిమా కోసం బ‌య్య‌ర్లు ఏకంగా రూ 16 కోట్లు కోట్ చేసి మ‌రీ రైట్స్ ద‌క్కించుకోవ‌డం ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌ను బ‌ట్టి ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. హారికా అండ్ హాసినీ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అజ్ఞాత‌వాసి అనే టైటిల్ ఈ సినిమాకు ప‌రిశీలిస్తున్నారు.