జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ ప్ల‌స్సులేంటి – మైన‌స్‌లేంటి

September 15, 2017 at 5:47 am
Jai lava Kusa, Spyder

టాలీవుడ్‌లో మ‌రో సంక్రాంతి సీజ‌న్ రెడీ అవుతోంది. ఈ ద‌స‌రాకు ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్ద‌రికి తోడుగా పెద్ద హీరోల‌తో త‌ల‌ప‌డుతూ హిట్లు కొడుతోన్న యంగ్ హీరో శ‌ర్వానంద్ మ‌హానుభావుడుతో రెడీ అవుత‌న్నాడు.

ఇక రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ రెండు సినిమాల‌కు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ రెండు సినిమాల ప్ల‌స్‌లు ఏంటి ? మైన‌స్‌లు ఏంటో ? చూద్దాం.

జై ల‌వ‌కుశ ప్ల‌స్‌ల విష‌యానికి వ‌స్తే

– ఈ సినిమాకు ఎన్టీఆరే మెయిన్ పిల్ల‌ర్‌, మూడు పాత్ర‌లు ఉండ‌డం, అందులో ఎన్టీఆర్ జై పాత్ర‌లో నెగిటివ్‌గా చేస్తుండ‌డం.

– జై ల‌వ‌కుశ టైటిల్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతోంది.

– ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో అంద‌రూ ఈ సినిమా కోసం ఆస‌క్తితో ఉన్నారు.

– ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాక వ‌స్తున్న సినిమా కావ‌డం.

– సినిమాలో కామెడీ బాగా ఉండ‌డంతో అది మినిమం గ్యారెంటీ హిట్ టాక్ తెచ్చింది.

జై ల‌వ‌కుశ మైన‌స్‌లు (-):

– ఈ సినిమా డైరెక్ట‌ర్‌పై ఎవ్వ‌రికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డం.

– సినిమాలో హీరోయిన్లు రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ మ‌రీ ప్ల‌స్ కాక‌పోవ‌డం.

– సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్‌లు ఉండ‌డంతో సినిమా మొత్తం వాళ్ల‌నే చూడాల్సి రావ‌డం ఓ ఇబ్బందే.

– సెకండాఫ్‌లో ఎమోషన్లు ఎక్కువ కావ‌డం అన్న టాక్‌తో కామెడీ పక్క‌దారి ప‌ట్టిన‌ట్టు టాక్‌

స్పైడ‌ర్ ప్ల‌స్ పాయింట్స్ (+):

– మహేష్ బాబు & డైరక్టర్ మురుగదాస్ పెద్ద ప్లస్ పాయింట్.

– మురుగ‌దాస్ డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ ప్రెజెంటేషన్.

– మహేష్ బాబుకు మాస్, క్లాస్, ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ అ

– హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో విన్నింగ్ హార్స్.

– భారీ బ‌డ్జెట్, యాక్ష‌న్ సీన్లు.

– హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌.

స్పైడ‌ర్ మైన‌స్‌లు (-):

– స్పైడర్ జోనర్ ఫ్యామిలీలకు ఎంత వరకు టచ్ అవుతుందో అనే సందేహం.

– మ‌హేష్ ఫ్యాన్స్‌లో లేడీస్ ఎక్కువ‌. ఈ స్పై మూవీ వారికి ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో అన్న డౌట్‌.

– ఆడియోకు అనుకున్న టాక్ లేక‌పోవ‌డం.

ఫైన‌ల్‌గా…

భారీ బ‌డ్జెట్‌ల‌తో తెర‌కెక్కి భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఈ రెండు సినిమాల‌కు యావ‌రేజ్ టాక్ కాదు హిట్ టాక్ రావాలి. అప్పుడే అంద‌రూ లాభ‌ప‌డ‌తారు. ఇక జై ల‌వ‌కుశ వారం రోజుల మందు రావ‌డం… మొత్తంగా ద‌స‌రా సెల‌వులు కూడా క‌లిసి రావ‌డంతో ఈ రెండు సినిమాల‌కు క‌లిసి రానుంది.

 

జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ ప్ల‌స్సులేంటి – మైన‌స్‌లేంటి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share