ప్రభాస్ లవర్ కి సీక్రెట్ పెళ్లి

ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో జనాల్లోకి చేరిపోతుంది.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించిన గాసిప్స్ అంటే ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఓ హీరోయిన్‌కు పెళ్ల‌య్యింద‌న్న వార్త నెట్టింట్లో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేసింది. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. చివ‌ర‌కు ఈ విష‌యం ఆ హీరోయిన్ చెవికి చేర‌డంతో నాకు పెళ్లి ఎప్పుడు అయ్యిందా ? అని ఆ అమ్మ‌డు షాక్ అయిపోయింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా ‘లీడర్’ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రిచా గంగోపాధ్యాయ్ ఆ తర్వాత ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘నాగవల్లి’, ‘మిర్చి’ వంటి చిత్రాల్లో నటించింది.  కారణాలు తెలియదు కానీ ఈ అమ్మడు కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అంతే కాదు ప్రస్తుతం రిచా అమెరికాలో ఉంటుంది. తాజాగా  రిచా గంగోపాధ్యాయ్ పెళ్లి చేసుకుందంటూ వార్తా కథనాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

తన చిన్ననాటి స్నేహితుడిని రహస్యంగా పెళ్లి చేసుకుందని, అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై స్పందించిన రిచా గంగోపాధ్యాయ్ త‌న‌పై ఇలాంటి వార్తలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని..2013 నుండి సినిమాలు చేయడం మానేశాను…. సినిమాలకు దూరంగా ఉంటున్న త‌న‌పై ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ మండిప‌డింది. సినిమాల‌కు గుడ్ బై చెప్పి ఐదేళ్లు అయ్యింద‌ని, త‌న కెరీర్‌లో ఏదైనా సాధించాకే పెళ్లి విష‌యం ఆలోచిస్తాన‌ని రిచా తెలిపింది. అప్ప‌టి వ‌ర‌కు త‌న లైఫ్‌ను త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు బ‌త‌క‌నీయాల‌ని ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న ప్ర‌చారం చేస్తోన్న వాళ్ల‌కు మొర‌పెట్టుకుంది.