ఆ రోజు సాహో.. ఫిక్స‌యిన ప్ర‌భాస్‌..!

November 19, 2018 at 10:49 am

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సాహో. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఇది తెర‌కెక్కుతోంది. యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్‌, విక్కీ నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమా విడుద‌ల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తీ అంశం కూడా వారిలో మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి ఓ విష‌యం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.saaho_149335913930

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన రోజు ఆగ‌స్టు 15వ తేదీన సాహో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్ర‌భాస్‌తోపాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సానుకూలంగా ఉన్నార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. అంటే.. 2019 ఆగ‌స్టు 15న ఈ సినిమా విడుద‌ల అవుతుంద‌న్న‌మాట‌. ఇంకా చాలా స‌మ‌యమే ఉందికానీ.. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి చిత్రం ఇదే కావ‌డం, భారీ బాడ్జెట్‌తో రూపొందిస్తుండ‌డం.. త‌దిత‌ర అంశాలతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు దీనిపై బ‌జ్ మెయింటేన్ చేస్తోంది చిత్రం యూనిట్‌.sssss

నిజానికి.. వ‌చ్చే వేస‌విలోనే విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నార‌ట‌. అయితే.. వీఎఫ్ఎక్స్ ప‌నులు ఆ స‌మ‌యానికి అయ్యేట‌ట్టు లేక‌పోవ‌డంతో ఆగ‌స్టు 15వ తేదీకి వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన సాహో మేకింగ్ వీడియోకు మాంచి స్పంద‌న వ‌స్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముఖేశ్‌, మందిరాబేడి, చుంకీ పాండే లాంటి ప్ర‌ముఖ న‌టులు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఆ రోజు సాహో.. ఫిక్స‌యిన ప్ర‌భాస్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share