రికార్డు రేటుకు ‘గరుడ వేగ’ శాటిలైట్ రైట్స్‌

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్  హీరో డాక్టర్ రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవ‌ల‌ రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారని..ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని రక రకాల రూమర్లు వచ్చాయి.  ‘ఓటమి .. వాయిదా వేయబడిన గెలుపు’ అనే మాటను వింటూ ఉంటాం .. అదే మాట ఇప్పుడు రాజశేఖర్ విషయంలో నిజమైంది.  

టాలీవుడ్ వరుసగా అపజయాలు ఎదుర్కొన్న రాజశేఖర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గరుడవేగ’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.  ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాజశేఖర్‌కి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయి. 

అయితే సినిమా రిలీజ్ కి ముందు శాటిలైట్ రైట్స్ అమ్మేసి ఉంటే రూ. 2 కోట్ల లోపే వచ్చి ఉండేది. ల‌క్ ఏంటంటే సినిమా రిలీజ్‌కు ముందు శాటిలైట్ రైట్స్ అమ్మ‌క‌పోవ‌డం ఇప్పుడు క‌లిసొచ్చింది. ఇప్పుడు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో శాటిలైట్ రైట్స్‌కు మంచి రేటు వ‌చ్చింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు రూ. 4 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్‌. ఇది రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే రికార్డు రేటు.