రాధికా ఆప్టేతో వల్గ‌ర్ దుస్తులు వేయించిన సౌత్‌ హీరో..!

November 10, 2018 at 3:32 pm

రాధికా ఆప్టే మ‌ళ్లీ నోరు తెరిచింది. త‌న‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల అంశంపై మ‌రోమారు స్పందించింది. మీ టూ ఉద్య‌మం చ‌ల్లారుతుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఆమెతో వ‌ల్గ‌ర్‌గా ప్ర‌వ‌ర్తించిన సౌత్ టీమ్ ఎవ‌ర‌న్న దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మొన్న‌టికి మొన్న హీరో అర్జున్‌పై కూడా క‌న్న‌డ హీరోయిన్ శ‌`తి హ‌రిహ‌ర‌న్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్య‌ల‌తో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. కాక‌పోతే.. ఆమె చేసిన ఆరోప‌ణ‌లు అర్జున్‌పై కాదుగానీ మ‌రో సౌత్ హీరోనే కావ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి.. కాస్టింగ్ కావొచ్చు.. మీ టూ ఉద్య‌మం కావొచ్చు… ఈ రెండు అంశాల‌పైనా రాధికా ఆప్టే మొద‌టి నుంచీ మాట్లాడుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తనను సౌత్‌లో ఓ ప్రముఖ హీరో లైంగిక వేధింపులకు గురిచేసేందుకు ప్రయత్నించాడంటూ రాధికా ఆప్టే ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న ఆమె సౌత్‌లో తనకు ఎదురైన ఓ చేదు ఘటన గురించి తాజాగా మరోమారు చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ హీరోతో సినిమా అంటూ తనను కొందరు సంప్రదించారని, తాను ఒప్పుకుని వెళ్ల‌గా… అక్క‌డ ఓ చీప్‌ హోటల్‌లో రూం బుక్‌ చేయడమే కాకుండా, తనతో అసభ్యకరంగా ఆ టీమ్‌ ప్రవర్తించిందని, తనతో వ‌ల్గ‌ర్ బ‌ట్ట‌లు వేయించి.. ఫొటో షూట్స్‌ కూడా చేయించారని రాధికా ఆప్టే చెబుతోంది. అయితే.. ఆ ఫొటోలు ఏమయ్యాయో, ఆ సినిమా ఏమయ్యిందో తనకు తెలియదని ఆమె వాపోయింది.balakrishna-radhikaapte-Chai-Bisket

అయితే.. మొద‌ట అంద‌రి ద‌`ష్టి తెలుగు హీరోల‌పైనే ప‌డింది. నిజానికి తెలుగులో రాధికా ఆప్టే మూడు సినిమాల్లో న‌టించింది. రక్త‌చ‌రిత్ర‌, బాల‌క‌`ష్ణ హీరోగా న‌టించిన లెజెండ్‌, డిక్టేట‌ర్‌. మొద‌ట్లో అంద‌రూ దాదాపుగా బాల‌క‌`ష్ణ‌నేమోన‌ని అనుకున్నారు. ఆమె చేసిన ఆరోప‌ణ‌లు కూడా అందుకు బ‌ల‌న్న ఇచ్చేలాగా ఉన్నాయి అప్పుడు. కానీ.. ఆ ఆరోప‌ణ‌లు చేసింది విక్రమ్‌పైనేన‌నే టాక్ వినిపిస్తోంది. విక్రమ్‌ పేరు చెప్పి కొందరు రాధికా ఆప్టేతో అలా వ్యవహరించారని తమిళ ఇండ‌స్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూద్దాం మ‌రి ముందుముందు ఏం జ‌రుగుతుందో..!

రాధికా ఆప్టేతో వల్గ‌ర్ దుస్తులు వేయించిన సౌత్‌ హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share