భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న లారెన్స్‌

January 9, 2019 at 5:30 pm

హ‌ర్ర‌ర్ సినిమాల‌ను తెరకెక్కిచండంలో లారెన్స్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మాస్ సినిమాతో మెగా ఫోన్ ప‌ట్టుకున్న లారెన్స్ స్టైల్, ముని, కాంచ‌న‌, గంగ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కాంచ‌న సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్క‌డ‌మే కాదు..బాక్సాపీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపించింది. ఇక ఈ సినిమాను హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ రీమేక్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత దానికి సీక్వెల్‌గా వ‌చ్చిన గంగ కూడా ఆ స్థాయి కాక‌పోయిన మంచి క‌లెక్ష‌న్ల‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే కోవ‌లో సీక్వెల్‌గా మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌డంలో లారెన్స్ త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఈ సారి ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎక్కువ భ‌య‌ప‌డేట్లు కెమెరా యాంగిల్స్‌ను.. బ్యాక్‌గ్రౌండ్ను వాడుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

తమిళంలో రూపొందుతున్న ‘కాంచన 3లో కూడా లారెన్స్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అన్నట్లుగానే తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ తోనే లారెన్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు. లారెన్స్ ఓల్డ్ గెటప్ లోని మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మోషన్ పోస్టర్ కు వేసిన ఆర్ ఆర్ కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అద్బుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో పాటు – తనదైన శైలి కామెడీతో ఈ చిత్రంను లారెన్స్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యిందని త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో లారెన్స్ ఎక్కువగా ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.49818064_1179801145513666_2597514075076296704_n

ఓల్డ్ గెటప్ కోసం లారెన్స్ చాలా కష్టపడ్డట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమాను ఠాగూర్ మధు డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నాడు. గతంలో వచ్చిన లారెన్స్ హర్రర్ సినిమాలను మించి ఇది ఉంటుందని అంటున్నారు. మరింతగా భయపడేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భ‌య‌పెడుతూనే న‌వ్వించ‌డం అనే ఫార్మూల‌తో కాంచ‌న సినిమా సూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకుంది. హ‌ర్ర‌ర్ సినిమాలో కొత్త ర‌కం పాయింట్‌ను క‌నిపెట్టిన లారెన్స్ ద‌ర్శ‌క‌త్వానికి ప్రేక్ష‌కులు జైకొట్టారు. ఇప్పుడు అదే ఫార్ములాతో వ‌స్తున్న కాంచ‌న‌3 ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి. ఎప్పుడు విడుదల కాబోతుందనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారట.

భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న లారెన్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share