‘ రాజా ది గ్రేట్ ‘ ర‌న్ టైం డీటైల్స్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ దాదాపు రెండేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రాజా ది గ్రేట్‌. రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌వితేజ ఆ సినిమాతో స‌రిగా హిట్ కొట్ట‌లేదు. కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత ర‌వితేజ గ్రాఫ్ బాగా ప‌డిపోయింది. ఇక రాజా ది గ్రేట్ సినిమాతో ర‌వితేజ హిట్ కొట్టి త‌న పూర్వ‌పు ఫామ్‌ను అందుకోవాల‌ని ఆతృత‌తో ఉన్నాడు.

ఇక సెన్సార్ రిపోర్ట్ ప్ర‌కారం యూ / ఏ స‌ర్టిఫికెట్ పొందిన ఈ సినిమాపై టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో రిలీజ్‌కు ముందే హిట్ టాక్ వ‌చ్చేసింది. సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. ఇక హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాజా ది గ్రేట్ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ర‌న్ టైం 2.29 గంట‌లు (149 నిమిషాలు) గా ఉండ‌నుంది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం వ‌స్తోన్న రెగ్యుల‌ర్ సినిమాల ర‌న్ టైంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ‌నే చెప్పాలి. ఇంత సేపు థియేట‌ర్లో ప్రేక్ష‌కులు కూర్చోవాలంటే దానికి త‌గిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ పుష్క‌లంగా ఉండాలి. మ‌రి ర‌వితేజ రాజాగా ఎలాంటి విన్యాసాలు చేశాడో తెలియాలంటే ఈ నెల 18 వ‌ర‌కు ఆగాల్సిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించింది.