రజిని దెబ్బకు అల్లుడు ఫుల్ జోష్

June 13, 2018 at 10:20 am
rajini-dhanush

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – పా.రంజిత్ కాంబోలో వ‌చ్చిన కాలా సినిమా తొలి షో నుంచే డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. వీరి కాంబోలో గ‌తేడాది వ‌చ్చిన క‌బాలి సినిమా ప్లాప్ అవ్వ‌గా ఇప్పుడు కాలాది సేమ్ టాక్‌. అయితే కాబాలి దెబ్బ‌తోనే ఇప్ప‌ట‌కీ కోలుకోని బ‌య్య‌ర్లు ఇప్పుడు కాలా దెబ్బ‌తో మ‌రింత పాతాళంలోకి వెళ్లిపోయారు. ఓవరాల్‌గా కాలా రూ. 155 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ని సాధించిన విషయం తెలిసిందే..

 

అయితే ఈ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. సినిమా యూనిట్ వ‌ర్గాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం కాలాను రంజిత్ కేవ‌లం రూ. 25-30 కోట్ల‌తో కంప్లీట్ చేసేశార‌ట‌. ఈ సినిమా నిర్మాత ధ‌నుష్ ర‌జ‌నీకి అల్లుడే కావ‌డంతో ర‌జ‌నీకి బిజినెస్ అయ్యేవ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఏం ఇవ్వ‌లేద‌ట‌. రజినీకాంత్ రెమ్యునరేషన్ పక్కకు పెడితే సినిమా నిర్మాణ ఖర్చు కేవలం 25 -30 కోట్లే

 

ఇక ర‌జ‌నీ ఒక్కో సినిమాకు రూ. 50-60 కోట్ల మ‌ధ్య‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడు. మొత్తం మీద రూ.30 కోట్ల‌కు లోపుగా పెట్టుబ‌డి పెట్టిన ధ‌నుష్ ఏకంగా రూ.120 కోట్ల‌కు పైగా లాభాల‌ను త‌న జేబులో వేసుకున్నాడు. ఇక ర‌జ‌నీ రెమ్యున‌రేష‌న్ ఓ 50 కోట్లు ఇచ్చినా ధ‌నుష్‌కు రూ. 70 కోట్ల‌కు పైనే లాభం. కాలా దెబ్బ‌తో ర‌జ‌నీ, ధ‌నుష్ జేబులు ఫుల్లుగా నిండితే కాలా కొన్న వారంద‌రు తేలలేకుండా మునిగిపోయారు.

రజిని దెబ్బకు అల్లుడు ఫుల్ జోష్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share