రజినీకాంత్ కి భారీ సెక్యూరిటీ..అందుకేనా!

September 10, 2018 at 4:41 pm
000111222

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే భారత దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు..ఒక్క భారత్ లోనే కాదు హాంకాంగ్, చైనా, అమెరికా, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రజినీకాంత్ సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లో కి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ఎక్కడ షూటింగ్ జరిగినా..ఆయనకు భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పెట్ట’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ ను గ్రాఫిక్స్ లో చిత్రీకరించినా రజనీ మాస్ హీరో లుక్ మాత్రం అందరికీ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని లక్నో సిటీలో జరుగుతోంది. తాజాగా ‘పెట్ట’ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ వార‌ణాసిలోను కొన్ని రోజుల పాటు ప్లాన్ చేశారు.

అయితే ఫోటో లీకేజ్ చూస్తుంటే..రజినీకాంత్ కి భారీ ఎత్తున సెక్యూరిటీ అరేంజ్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఉత్త‌ర ప్రదేశ్ ప్ర‌భుత్వం త‌లైవాకి 25 మంది పోలీసులతో కూడిన భారీ సెక్యూరిటీని కల్పించింది, అంతేకాదు ఆయ‌న ఉండే ప్రాంతంలో ఎప్పుడూ ఓ మిలిట‌రీ పోలీసు వ్యాన్ ప‌హారా కాస్తుంద‌ట‌. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న పేటా చిత్రాన్ని జిగ‌ర్తాండ ఫేం కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మూవీలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తుంది. విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ర‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గత కొంత కాలంగా స్టార్ సినిమా షూటింగ్స్ లో జనాలు అడ్డుపడుతుండడంతో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం ఇలా ముందుజాగ్రత్త తీసుకుందట.

రజినీకాంత్ కి భారీ సెక్యూరిటీ..అందుకేనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share