నాగ్ ‘ గ‌ది ‘ సేఫ్‌

టాలీవుడ్‌లో వ‌రుస భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు పీవీపీ. వ‌ర్ణ‌, బ్ర‌హ్మోత్స‌వం లాంటి సినిమాలు మ‌నోడిని కోలుకోలేని విధంగా దెబ్బ‌తీశాయి. త‌ర్వాత క్ష‌ణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు స‌క్సెస్ అయ్యి మ‌నోడికి కొంత‌వ‌ర‌కు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా రాజుగారి గ‌ది 2. స‌మంత‌, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీర‌త్‌క‌పూర్ అందాల ప్ర‌ద‌ర్శ‌నలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి.

సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో రాజుగారి గ‌ది 2 రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లోకి చేరిపోయింది. శాటిలైట్ రైట్స్‌ టాప్ రేటుకు ఓ ప్ర‌ముఖ ఛానెల్ ద‌క్కించేసుకుంది. శాటిలైట్ రైట్స్‌తోనే పీవీపీ ఖాతాలో రూ. 8 కోట్లు వ‌చ్చాయి. ఇక హిందీ

డబ్బింగ్, డిజిటల్, ఆల్ రైట్స్‌తో మ‌రో రూ.2 కోట్లు యాడ్ అయ్యాయి. ఇక్కడే రూ.10 కోట్లు వ‌స్తే, ఇక ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, సీడెడ్, కర్ణాటక రైట్స్‌తో మ‌రో రూ 8-9 కోట్లు రిక‌వ‌రీ అయిపోయింది.

ఈ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్ అంతా పైన చెప్పుకున్న రైట్స్‌తో వ‌చ్చేసింది. ఇక నైజాం, వైజాగ్‌, ఓవ‌ర్సీస్‌, త‌మిళ‌నాడు, రెస్టాఫ్ ఇండియా రైట్స్ అంతా లాభాల కిందే లెక్క‌. ఈ లాభాల‌ను మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, పీవీప‌, డైరక్టర్ ఓంకార్ షేర్ త‌మ వాటాల‌కు అనుగుణంగా పంచుకోనున్నారు.

ఇక సినిమా రిలీజ్‌కు ముందే సేఫ్ అవ్వ‌డంతో మంచి లాభాలు కొల్ల‌గొట్టేసింది. సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ కూడా రావ‌డం క‌న్‌ఫార్మ్‌. బుకింగ్ ఏప్స్ లో ఫస్ట్ డే ఫుల్స్ అప్పుడే బాగానే కనిపిస్తున్నాయి. ఇక జై ల‌వ‌కుశ‌, మ‌హానుభావుడి హ‌డావిడి త‌గ్గ‌డంతో కావాల్సిన‌న్ని థియేట‌ర్లు కూడా దొరికేశాయి. సినిమా హిట్ అయితే చాలు పీవీపీ పంట పండిన‌ట్టే..!