అబ్బాయిలకు రకుల్ బంపర్ ఆఫర్

November 21, 2018 at 3:59 pm

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ర‌కుల్‌ప్రీత్ ఒక‌రు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ ప్ర‌తీ సినిమాను ఎంజాయ్ చేస్తోంది. తెలుగులోనే కాదు హిందీ, తమిళ భాష‌ల్లోనూ త‌న స‌త్తా చాటుకుంటోంది ఈ అమ్మ‌డు. అయితే.. మీడియాకు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. సినిమాల‌తోపాటు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలను పంచుకుంది. ఈ క్ర‌మంలో ప్రేమ‌, పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడింది. త‌న‌కూ ప్రేమించే టైం వ‌చ్చింద‌ని చెప్పేసింది.42509129_1965966133499823_7707649559513530368_n

“ ప్ర‌స్తుతం నాకున్న సినిమా షెడ్యూల్స్‌తో ప్రేమించడానికి సమయం ఎక్కడుంటుంది? నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నా. ఎందుకో నాక్కూడా తెలియ‌డం లేదు. అయితే.. ఇప్పుడు నాకు ప్రేమ అవసరం ఉందనిపిస్తోంది. అందుకే ముంబయి, హైదరాబాద్‌లో ఉన్న నా స్నేహితులకు నాకో మంచి అబ్బాయిని వెతికిపెట్టాలని చెప్పాను“ అని ర‌కుల్‌ప్రీత్ త‌న మ‌న‌సులోని మాట‌ను క‌క్కేసింది. అంటే త్వ‌ర‌లోనే ర‌కుల్ ప్రేమ‌లో ప‌డ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు.42977893_1974587455971024_7612995940667883520_n

అంతేగాకుండా.. ర‌కుల్ మ‌రికొన్ని విష‌యాల‌ను కూడా పంచుకుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాలో శ్రీ‌దేవి పాత్ర‌లో ఆమె న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాను శ్రీ‌దేవి పాత్ర‌లో మాత్ర‌మే న‌టించ‌గ‌ల‌న‌ని, శ్రీ‌దేవిలా మాత్రం ఎప్ప‌టికీ కాలేన‌ని చెప్పింది. అంతేగాకుండా.. ఆమె త్వ‌ర‌లోనే బిజినెస్ రంగంలోకి అడుగుబోతున్న‌ట్లు చెప్పింది. ఇప్ప‌టికే తాను మూడు ఫిట్‌నెస్ సెంట‌ర్లు ఏర్పాటు చేశాన‌నీ.. త్వ‌ర‌లోనే ఓ రెస్టారెంట్ ను కూడా ప్రారంభించాల‌ని అనుకుంటున్న‌ట్లు ర‌కుల్ వెల్ల‌డించింది.

అబ్బాయిలకు రకుల్ బంపర్ ఆఫర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share