“రాంచరణ్” ని వేదిస్తున్న కొత్త సమస్య?!

October 15, 2018 at 12:32 pm

టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు మెగా హీరోలు ఎంతో మంది వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలు తక్కువే అయినా..అన్ని మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోల టైమ్ షెడ్యూల్ సరిగా మెయింటేన్ చేయరని టాక్ వినిపిస్తుంది. అందులో రాంచరణ్ పేరు కూడా అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. అంతే కాదు ఆయన బాబాయి పవన్ కళ్యాన్ విషయంలో కూడా కొన్ని సార్లు షూటింగ్ లకు డుమ్మా కొడతారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు షెడ్యూలు షెడ్యూలుకు మధ్య గ్యాప్ తీసుకుని షూటింగ్ చేస్తుంటారు. కాకపోతే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రం సినిమా మొదలు పెడితో పూర్తయ్యే వరకు కంటిన్యూగా హాజరవుతారని టాక్.

ఈ మద్య ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అంత విషాదంలోనూ ఎన్టీఆర్ ఐదో రోజు నుంచే షూటింగ్ మొదలు పెట్టి ‘అరవింద సమేత’ సినిమా పూర్తి చేశారు. అయితే షూటింగ్ విషయంలో… శర్వానంద్ ఎగ్గొట్టరు కానీ, షెడ్యూళ్ల ప్లానింగ్ లో కాస్త బద్దకం కనిపిస్తుంది. అయితే ఈ హీరోలు ఇలా చేయడానికి అన్నింటికీ ఒకటే కారణం అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దాదాపు అందరు తెలుగు టాప్ హీరోలకు ఒకటే సమస్య అని తెలుస్తోంది. అది మరేంటో కాదు, నడుము నెప్పి సమస్య.

పవన్, చరణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా అందరికీ ఈ సమస్య వుందని, అయితే పవన్, చరణ్ లకు కాస్త ఎక్కువ అని తెలుస్తోంది. దీనికి కారణం కొన్ని యాక్షన్ సీన్లలో గాల్లోకి ఎగరడం, మెలికలు తిరగడం ఇలా రకరకాల ఫైట్లు చేయాలి అంటే బాడీ అంతటికి తాళ్లు కట్టి, కప్పీ లేదా పుల్లీ సాయంతో బలంగా ఒకేసారి లాగడం, విడవడం వంటివి చేస్తారు. దీంతో శరీరం అంతా ఒకేసారి అన్ని వైపుల నుంచి బలంగా గుంజినట్లు అవుతుంది. అందుకే చాలా అవసరం అయితే కానీ ఇలాంటి ఫీట్స్ చేయడానికి ఒప్పుకోరు. కానీ ఫ్యాన్ కోసం, సినిమా ఫైట్ లు భారీగా వుండడం కోసం ఈ విధంగా చేయక తప్పడంలేదు. ఏది ఏమైనా ప్రజలను రంజింప చేయడం కొసం కొంత మంది హీరోలు చేస్తున్న ఈ ప్రయోగాలు వారి ఆరోగ్యానికే ప్రమాదం మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.

“రాంచరణ్” ని వేదిస్తున్న కొత్త సమస్య?!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share