రామ్ చరణ్ ఆ ఒక్కటీ అడక్కు ….డి.వి.వి దానయ్య

January 18, 2019 at 1:44 pm

ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు.. నిర్మాత‌, బ‌య్య‌ర్ల జీవితాలు తారుమారు అవుతాయి. రోడ్డు మీద‌కి తీసుకొస్తుంది. ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన విన‌య విధేయ రామ సినిమా కూడా నిర్మాత‌, బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచింది. ఇక ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్ ప‌రిస్థితి అయితే.. రోడ్డు మీద‌నే. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను అవ‌స‌రానికి మించి ఖ‌ర్చు పెట్టించ‌డంతో నిర్మాత డీవీవీ దాన‌య్య కూడా ఏమీ మిగ‌ల‌లేద‌ట‌. మొత్తంగా బ‌య్య‌ర్ల‌కు సుమారు రూ.25కోట్ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కావ‌డం.. రాంచ‌ర‌ణ్ హీరో కావ‌డం.. మాస్ ఎలిమెంట్స్ ఫుల్‌గా ఉండ‌డంతో కొద్దోగొప్పో వ‌సూళ్లు రాబ‌డుతోంది. కానీ.. న‌ష్టాలు మాత్రం త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ ఒక విష‌యం ఏమిటంటే.. ఏదైనా సినిమా న‌ష్టాలు తెచ్చిపెడితే ప‌లువురు నిర్మాత‌లు బ‌య్య‌ర్ల‌కు కొద్దోగొప్పో ప‌రిహారం ఇస్తారు. కానీ.. ఈ విష‌యంలో డీవీవీ దాన‌య్య ఎన్న‌డు కూడా ఇచ్చిన దాఖ‌లాలు లేవు.

నిజానికి.. ఈ సినిమాకు బోయ‌పాటి కూడా విచ్చ‌ల‌విడిగా దాన‌య్య‌తో ఖ‌ర్చు పెట్టించాడ‌ట‌. దీంతో డీవీవీ కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో లోక‌ల్ బ‌య్య‌ర్ల‌కు కూడా రూపాయి తిరిగి ఇచ్చే ప‌రిస్థితి లేదు.. ఇక ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల‌పై హీరో రాంచ‌ర‌ణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

రామ్ చరణ్ ఆ ఒక్కటీ అడక్కు ….డి.వి.వి దానయ్య
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share