భారీ యాక్షన్ సీన్లతో ‘వినయ విధేయ రామ’టీజర్ టాక్

November 9, 2018 at 12:06 pm

టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకన్న బోయపాటి శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. బాలకృష్ణ తో బోయపాటి సింహా, లెజెండ్ సినిమాలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఇక బోయపాటి సినిమా అంటే పూర్తిగా యాక్షన్, సెంటిమెంట్ అని ఫిక్స్ అవ్వాల్సిందే..అంతే కాదు యాక్షన్ సీన్లు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టాక్. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్. మెగా హీరోలు అంటే మాస్ కి కేరాఫ్ అడ్రాస్ అంటారు. తాజాగా బోయపాటి-రాంచరణ్ కాంబినేషన్ లో ‘వినయ విధేయ రామ’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.45683764_1731399910304888_8003030167154851840_n

ఈ మద్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. రెండు చేతులతో ఆయుధాలు పట్టుకొని పరుగెడుతోన్న స్టిల్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ చూస్తుంటే..రాంచరణ్ విశ్వరూపం చూపించినట్లు కనిపిస్తుంది. ఇక బోయపాటి యాక్షన్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతే కాదు పవర్ ఫుల్ డైలాగ్స్ తో రాంచరణ్ యాక్షన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్.

‘అన్నా వీడ్ని చంపాలా భయపెట్టాలా..భయపెట్టాలంటే పది నిమిషాలు..చంపాలాంటే పావుగంట ఏదైనా ఓకే’ అంటూ రాంచరణ్ డైలాగ్..హేయ్..నువ్ పందెం పరుశరామ్ అయితే ఏంటిరా..రామ్ కొణిదెల అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్స్ కొడుతున్నాడు. మొత్తానికి మెగా అభిమానులు ఊహించినట్లే బోయపాటి శ్రీనివాస్ దర్శకత్ంలో ‘వినయ విధేయ రామ’రాంచరణ్ అభిమానులను మరోసారి మెప్పించేలా ఉన్నాడు. యారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు.

భారీ యాక్షన్ సీన్లతో ‘వినయ విధేయ రామ’టీజర్ టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share