రామ్ చరణ్ దెబ్బకు “వివిఆర్” బయ్యర్ గల్లంతు !

January 15, 2019 at 10:49 am

విన‌య విధేయ రామ ఇదేమి క‌ర్మ‌.. అన్న‌ట్టు త‌యారైంది బ‌య్య‌ర్ ప‌రిస్థితి. ఈయ‌న మ‌న లోక‌ల్ బ‌య్య‌ర్‌కాదులెండి.. యూఎస్‌లో ఈ సినిమాని తీసుకున్న బ‌య్య‌ర్‌. ఇక్క‌డి బ‌య్య‌ర్‌కు క‌న్నా న‌ష్ట‌ప‌రిహారం ఇస్తారేమోకానీ.. అక్క‌డ మాత్రం ప‌ట్టించుకునేవారే ఉండ‌రు. దీంతో ల‌బోదిబోమ‌ని మొత్తుకోవ‌డం త‌ప్ప చేసేదేమీ లేదు పాపం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమా యూఎస్‌లో ఏకంగా మూడున్న‌ర‌మిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్ వ‌సూలు చేసింది. క్లాస్ ట‌చ్ మూవీ కావ‌డంతో జ‌నం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు.

నిజానికి స‌హ‌జంగానే.. యూఎస్‌లో టాలీవుడ్ మాస్ సినిమాల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ఉండ‌దు. అందులోనూ బోయ‌పాటి శ్రీ‌ను లాంటి మాస్ డైరెక్ట‌ర్ల సినిమాల‌ను ఆద‌రించ‌డం క‌ష్ట‌మే. అయితే.. ఇక్క‌డ విన‌య విధేయ రామ సినిమాలో హీరో రాంచ‌ర‌ణ్ కావ‌డంతో.. అంతో ఇంతో మార్కెట్ ఉంటుంద‌ని భావించిన స‌ద‌రు బ‌య్య‌ర్ ఈ సినిమాను భారీ మొత్తానికి తీసుకున్నాడు. కానీ.. ఏంలాభం.. ముందునుంచీ అంద‌రు అనుకున్న‌దే జ‌రిగింది. ఓవ‌ర్సీస్‌లో మొద‌టి షో నుంచే నెగెటివ్ టాక్ రావ‌డంతో థియేట‌ర్ వైపు చూసిన వాళ్లే లేరు.

నెగెటివ్ టాక్ రావ‌డం.. రేటింగ్స్ దారుణంగా ఉండ‌డంతో యూఎస్‌లో విన‌య విధేయ రామ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. మొత్తంగా ఈ సినిమా సుమారు మూడు ల‌క్ష‌ల డాల‌ర్లు కూడా వ‌సూలు చేస్తుందో లేదోన‌ని స‌ద‌రు బ‌య్య‌ర్ తీవ్ర ఆందోళ‌న చెందుతున్నాడ‌ట‌. ఇక ఆయ‌న చేతికి కోటి రూపాయ‌లు వ‌స్తే.. ఖ‌ర్చులు.. అవీ ఇవీ పోను చిల్లిగ‌వ్వ కూడా మిగ‌ల‌ద‌న్న‌మాట‌. మొత్తంగా బ‌య్య‌ర్ సుమారు ఆరోకోట్ల రూపాయ‌ల‌కుపైగా న‌ష్ట‌పోయాడ‌నే టాక్ వినిపిస్తోంది. పాపం బ‌య్య‌ర్‌..!

రామ్ చరణ్ దెబ్బకు “వివిఆర్” బయ్యర్ గల్లంతు !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share