‘ పైసా వ‌సూల్ ‘ ఆడియో ఖ‌మ్మంలోనే ఎందుకు?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 101వ సినిమా `పైసా వ‌సూల్` ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని హిట్ అయ్యింది. శాత‌క‌ర్ణి యూఎస్‌లో 1.5 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్ట‌డంతో పాటు ఓవ‌రాల్‌గా రూ. 77 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇక శాత‌క‌ర్ణి త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే పైసా వ‌సూల్‌పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పైసా వ‌సూల్ స్టంప‌ర్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. పైసా వ‌సూల్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. సినిమా చాలా స్పీడ్‌గా కంప్లీట్ అవ్వ‌డంతో చిత్ర‌యూనిట్ అనుకున్న డేట్ కంటే చాలా ముందుగానే సెప్టెంబ‌ర్ 1న సినిమాను రిలీజ్ చేస్తోంది.

ఈనెల 17న ఆడియో వేడుకను ఖ‌మ్మంలో నిర్వ‌హిస్తున్నారు. బాల‌య్య గ‌త సినిమాల‌కు భిన్నంగా ఈ సారి ఆడియోను హైద‌రాబాద్‌లో కాకుండా ఖ‌మ్మంలో ప్లాన్ చేశారు. ఎఆర్ అండ్ బిజీఎన్ఆర్ గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీలో పైసా వ‌సూల్ ఆడియో లాంచ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఈ ఆడియో వేడుక ఖ‌మ్మంలో నిర్వ‌హించ‌డానికి రీజ‌న్ ఏంట‌ని ఆరా తీయ‌గా అస‌లు విష‌యం వెల్ల‌డైంది. ఖ‌మ్మం అయితే అటు ఏపీ అభిమానుల‌కు, ఇటు తెలంగాణ అభిమానుల‌కు అనువుగా ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే ఇక్క‌డ పైసా వ‌సూల్ ఆడియో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిర్మాత భ‌వ్య ఆనంద‌ప్ర‌సాద్ సొంత జిల్లా కూడా ఖ‌మ్మం కావ‌డంతో అక్క‌డే ఈ ఈవెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు మ‌రో టాక్‌.