సంపూ దానికి బాగా భయపడ్డడా…

August 14, 2017 at 12:27 pm

తెలుగు బిగ్ బాస్ ప్రారంభానికి ముందు కంటెస్టెంట్ల‌లో బాగా పాపుల‌ర్ అయిన పేరు బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు. సంపూతో హౌస్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అదిరిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. వెండితెర‌పై త‌న‌దైన స్టైల్ కామెడీతో అల‌రించే సంపూ బిగ్‌బాస్‌లో మాత్రం బిక్క‌మొఖంతో తేలేశాడు. హౌస్‌లోప‌ల ప్రెజ‌ర్ త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.

సంపూను హౌస్‌లో ఉండ‌మ‌ని బిగ్ బాస్ ఎంత న‌చ్చ‌చెప్పినా సంపూ మాత్రం ఒప్పుకోలేదు. సంపూ వెళ్లిపోవ‌డంతో ఈ ప్లేస్‌లో హాట్ భామ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చింది. సంపూ ఫ్యామిలీకి దూరంగా ఉండ‌లేక‌పోతున్నాన‌ని చెప్పినా పూర్తి వివ‌రాలు మాత్రం చెప్ప‌లేదు. తాజాగా ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన సంపూ బెస్ట్ ఫ్రెండ్, ఫిల్మీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ సంపూ బ‌య‌ట‌కు ఎందుకు వెళ్లిపోయాడో అసలు కార‌ణం చెప్పాడు.

మ‌హేష్ – సంపూ బెస్ట్ ఫ్రెండ్స్‌. సంపూ మొద‌టి సినిమా హృదయ కాలేయం సినిమాలో మ‌హేష్ కూడా ఓ రోల్ చేశాడు. ఇక మ‌హేష్ డైరెక్ట్ చేసిన పెస‌ర‌ట్టు సినిమాలో కూడా సంపూ ఓ రోల్ చేశాడు. ఇక ఇప్పుడు సంపూ హౌస్ నుంచి వెళ్లిపోవ‌డం వెన‌క ఉన్న కార‌ణాన్ని మ‌హేష్ చెప్పాడు.

సంపూ సినిమా జీవితానికి నిజ జీవితానికి చాలా తేడా ఉందని, చాలా సెన్సిటివ్‌గా ఉండ‌డం, ప‌ల్లెటూరి నుంచి రావ‌డాన్ని అత‌డు చాలా ఇబ్బందిగా ఫీల‌య్యాడ‌ట‌. ఇక హౌస్‌లో బ‌య‌ట‌కు తెలియ‌ని చాలా విష‌యాలు జ‌రుగుతాయ‌ని అప్పుడప్పుడూ బ్లైండ్స్ వేసేవాళ్లని.. అలా చేసినపుడు సంపూ భయపడిపోయాడని మ‌హేష్ తెలిపాడు.

ఇక షో మ‌ధ్య‌లోనే వెళ్లిపోవ‌డం వ‌ల్ల సంపూకు, షోకు ఎంత న‌ష్ట‌మ‌ని చెప్పినా అత‌డు మాత్రం విన‌లేద‌ని, ఓ రోజు అత‌డి పిల్ల‌ల‌కు ఏదో అయిన‌ట్టు క‌ల‌వ‌చ్చింద‌ని సంపూ చెప్ప‌డంతో చివ‌ర‌కు ఎవ్వ‌రూ అత‌డిని ఆపేందుకు సాహ‌సించ‌లేద‌ని క‌త్తి మ‌హేష్ చెప్పాడు.

 

సంపూ దానికి బాగా భయపడ్డడా…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share