‘ఆర్ ఎక్స్ 100’డైరెక్టర్ కి పెరిగిన గిరాకీ!

July 17, 2018 at 6:54 pm
RX100-Director

ఈ మద్య కొత్త దర్శకులు కంటెంట్ తో పాటు కాస్త బోల్డ్ సీన్లు జత చేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు.  ఇండస్ట్రీల్లో ఇప్పటి వరకు ఎన్నో లిప్ లాక్ సీన్లు వచ్చాయి..కానీ ఆ మద్య సందీప్ వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాలో ఈ సీన్లుకు యూత్ బాగా ఆకర్షితులయ్యారు.  ఏదో ఆర్టిఫిషల్ కాకుండా ఆ సీన్లు చాలా నేచురల్ గా ఉన్నాయని..అలాంటి సన్నివేశాల్లో తమను తాము ఊహించుకుంటున్నామని ప్రేమికులు అభిప్రాయ పడ్డారు.  ఈ నేపథ్యంలో  అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ‘RX 100′ సినిమా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. RX100-Movie-Stills4

 

అయితే సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు.   లవ్ .. యాక్షన్ కలిపి అల్లిన ఈ కథ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా .. భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.  ఈ సినిమా చూసి ఆ మద్య రాంగోపాల్ వర్మ తెగ మెచ్చుకున్నారు. అంతే కాదు  తన వద్ద శిక్షణ తీసుకున్న అజయ్‌ భూపతి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉందని తెలిపారు. ajay

 

ఇప్పుడు  ‘RX 100′ సినిమా దర్శకుడి ని  పెద్ద పెద్ద నిర్మాతలు తమ బ్యానర్లో సినిమాలు చేయమని ఆయనని అడుగుతున్నారని తెలుస్తోంది.  భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ .. గోపీచంద్ సినిమా కోసం అజయ్ భూపతిని అడిగారట. 

ఇక రామ్ కోసం స్రవంతి మూవీస్ రవికిశోర్ .. నితిన్ కోసం ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి కూడా అజయ్ భూపతిని సంప్రదించారని అంటున్నారు.  రెండు ప్రాజెక్టులు చేయవలసి ఉంటుందంటూ మరో అగ్ర నిర్మాత కూడా ఆయనతో మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్నారు. అజయ్ భూపతి ముందుగా ఎవరి ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడో చూడాలి

‘ఆర్ ఎక్స్ 100’డైరెక్టర్ కి పెరిగిన గిరాకీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share