‘ఆర్‌.ఎక్స్.100’ హీరో నయా అవతార్

September 20, 2018 at 4:56 pm

‘ఆర్‌.ఎక్స్.100’ చిన్న సినిమాల్లో పెద్ద సంచ‌ల‌నం. ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన చిత్రం. తొలి చిత్రంతోనే యూత్ ఐకాన్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కార్తికేయ‌. టి.ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను నిర్మిస్తున్న ‘హిప్పీ’ చిత్రంలో కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్నారు. శుక్ర‌వారం కార్తికేయ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ‘హిప్పీ’ టైటిల్‌ను ప్ర‌క‌టించారు. దక్షిణ భారత సినీ రంగంలో కలైపులి యస్.థాను అంటే ఒక బ్రాండ్… అభిరుచి గల భారీ బడ్జెట్ నిర్మాతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

‘తుపాకి’, ‘తెరి’ ‘కబాలి’ వంటి భారీ చిత్రాలను ఆయన నిర్మించారు. సినిమా నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసుకుని తమిళనాట నిర్మాత‌గా, ప్రముఖ పంపిణీదారుడిగా కొన‌సాగుతున్నారు. అంత గొప్ప నిర్మాత.. కార్తికేయతో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. వి క్రియేష‌న్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నేడు (సెప్టెంబర్ 20న) కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ‘హిప్పీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.rx-100-hero-next-movie-confirmed_b_2009180154

ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ.. “రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. కార్తికేయ త‌న తొలి సినిమాకి భిన్నంగా క‌నిపిస్తారు. కేర్‌ఫ్రీ, కేజువ‌ల్‌గా సాగే పాత్ర‌లో ఆయ‌న న‌టిస్తారు. సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లుంటారు. వాళ్ల‌ని ఇంకా ఫైన‌ల్ చేయాలి. సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే ఈ సినిమా ఉండబోతుందని అన్నారు.

నిర్మాత క‌లైపులి య‌స్‌.థాను మాట్లాడుతూ.. ‘త‌మిళంలో 1985 నుంచి వ‌రుస‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించాం. అటు పంపిణీరంగంలోనూ మాదైన ముద్రతో కొన‌సాగుతున్నాం. తెలుగులో నేరుగా సినిమా తీయాల‌ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కార్తికేయ ‘ఆర్‌ఎక్స్100’ చూశాను. ప్రస్తుత ట్రెండ్‌కి త‌గ్గ హీరో అనిపించింది. ఆయ‌న‌తో ‘హిప్పీ’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఎక్కడా బ‌డ్జెట్‌కు వెన‌కాడ‌కుండా, సినిమాకు కావాల్సిన‌దంతా స‌మ‌కూర్చి భారీగా రూపొందిస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

‘ఆర్‌.ఎక్స్.100’ హీరో నయా అవతార్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share