ఆక‌ట్టుకుంటున్న” చిత్ర‌ల‌హ‌రి” టీజ‌ర్‌

March 13, 2019 at 11:04 am

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌. వ‌రుస సినిమాలు చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో బ్రేక్ మాత్రం రావ‌డం లేదు. విభిన్న క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌టిస్తున్న సినిమా చిత్ర‌ల‌స‌హ‌రి. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న విడుద‌ల చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. అయితే.. ఇందులోని అంశాల‌న్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ప్ర‌ధాన పాత్ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న విష‌యాన్ని దాదాపుగా చెప్పేశారు ఇందులో. హాస్యం పండించ‌డంలోనూ సాయిధ‌ర‌మ్ తేజ్‌ది ప్ర‌త్యేక శైలి.

చిత్ర‌ల‌హ‌రి సినిమాలోనూ సాయిధ‌ర‌మ్ తేజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను న‌మ్ముకున్న‌ట్లు టీజ‌ర్‌తో తెలుస్తోంది. మొత్తంగా స‌ర‌దా స‌ర‌దా సాగే క‌థ అని టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోతుంది. ఈ సినిమాలో సునీల్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఆక‌ట్టుకుంటున్న” చిత్ర‌ల‌హ‌రి” టీజ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share