హాట్ టాపిక్‌: నానిని తిట్టిన సాయి ప‌ల్ల‌వి…షూటింగ్ నుంచి నాని అవుట్‌

September 19, 2017 at 6:36 am
Sai Pallavi, Nani, MCA, Shooting

టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఇటీవ‌లే నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన నాని ప్ర‌స్తుతం మిడిల్ క్లాస్ అబ్బాయి – ఏంసీఏ సినిమాలో న‌టిస్తున్నాడు. నాని, సాయి పల్లవి జంటగా న‌టిస్తున్నారు. ఫిదా సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన సాయి పల్లవి – నాని కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దీనికి తోడు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతుండ‌డం వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌డంతో సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని సినీ జ‌నాలు ఉత్కంఠ‌తో ఉన్నారు.

డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ అంతా కూల్‌గా జ‌రుగుతోంది అనుకుంటున్న టైంలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య చిన్న వివాదం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఓ సీన్ షూట్ చేస్తోన్న టైంలో హీరో నాని, హీరోయిన్ల సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య జ‌రిగిన చిన్న వివాదం కాస్త పెద్ద‌ద‌య్యి హీరో నాని షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయే వ‌ర‌కు వ‌చ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ విన‌ప‌డుతోంది.

ఒక సీన్‌లో నాని, సాయి పల్లవి కలిసి నడుచుకుంటూ వెళ్లే సమయంలో గొడవ ప్రారంభం అయ్యిందని, అది కాస్త సాయి పల్లవి ఆగ్రహంతో నానిని తిట్టే వరకు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. దీంతో నాని హీరోయిన్ సాయి ప‌ల్ల‌విపై ఆగ్ర‌హంతో అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌ట‌. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు, నిర్మాత రాజు క‌లిపి సాయి పల్లవితో నానికి సారీ చెప్పించి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశార‌ట‌. ఫిదా సినిమాతో ఇప్పుడిప్పుడే తెలుగులో స్టార్ అయ్యే ఛాన్సులు ద‌క్కించుకుంటోన్న సాయి ప‌ల్ల‌వి అప్పుడే ఇలా కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకోవ‌డం ఆమె కెరీర్‌కు మంచిది కాదేమో..!

 

హాట్ టాపిక్‌: నానిని తిట్టిన సాయి ప‌ల్ల‌వి…షూటింగ్ నుంచి నాని అవుట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share