సినిమాలకు సమంత గుడ్ బై !

July 6, 2018 at 7:32 pm
samantha-cinema

‘ఏం మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన సమంత తర్వాత అగ్రహీరోలతో నటించి మంచి పొజీషన్లోకి వచ్చింది. సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది.   గత యేడాది అక్కినేని నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సమంత తర్వాత సినిమాల్లో నటించబోదని అందరూ అనుకున్నారు. 

 

 ఓ ఇంటర్వ్యూలో సమంత మాత్రం తనకు పెళ్లైనా సినిమాలు మాత్రం చేస్తానని..తనకు బోర్ వచ్చే వరకు సినిమాల్లో నటిస్తానని అన్నారు.  అయితే వివాహం అనంతరం సమంత రాజుగారి గది2, రంగస్థలం, అభిమన్యుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఈ మూడు సినిమాల్లో రంగస్థలం, అభిమన్యుడు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  దాంతో సమంతకు అప్పటికన్నా ఇప్పుడే డిమాండ్ బాగా పెరిగిపోయింది. 

 

 ప్రస్తుతం యూటర్న్ సినిమాలో నటిస్తుంది.  తాజాగా సోషల్ మీడియాలో  స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందంటూ ఓ వార్త చక్క‌ర్లు కొడుతుంది.  ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని సామ్ భావిస్తుంద‌ట‌.  అయితే పెళ్లైన తర్వాత సమంత సొంతం చేసుకున్న విజయాలు చూస్తుంటే..అప్ 

 

 ఒకవేల చైతూ, సమంత లకు పిల్లలు పుడితే కెరీర్ కి ఇబ్బందులు కలుగుతాయని ఈ నిర్ణయం తీసుకుందా.. అప్ప‌ట్లో తాము పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు అని చెప్పింది . పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం అని సామ్‌ తెలిపింది.  అయితే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి. 

సినిమాలకు సమంత గుడ్ బై !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share