స‌మంత హ్యాట్రిక్ కొట్టే..సంతోషంలో ట్వీట్‌

May 12, 2018 at 12:22 pm
samantha-

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రు అయిన చెన్నై బ్యూటీ స‌మంత‌కు కొద్ది రోజులుగా ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. 2016 నుంచి ఆమె ల‌క్ మామూలుగా లేదు. ఓ వైపు సౌత్‌లో వ‌రుస హిట్లు, మ‌రోవైపు అక్కినేని ఇంట పెద్ద కోడ‌లిగా ఆమె అడుగు పెట్ట‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులే లేవు. తాజాగా ఆమె హ్యాట్రిక్ కొట్టేసింది. 2016 నుంచి చూస్తే ఆమె న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లే అవుతున్నాయి. 

 

2016 స‌మ్మ‌ర్‌లో నితిన్‌తో స‌మంత న‌టించిన అ…ఆ, ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఎన్టీఆర్‌తో జ‌న‌తా గ్యారేజ్‌, రాజు గారి గ‌ది 2, మెర్స‌ల్ (తెలుగులో అదిరింది), రంగ‌స్థ‌లం అయితే బ్లాక్ బ‌స్ట‌రే అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఆమె కీల‌క పాత్ర‌లో న‌టించిన మ‌హాన‌టి బ‌యోపిక్ కూడా ఈ వారం విడుద‌లై సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. 

 

ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి హిట్ల‌తో జోరుమీదున్న ఆమెకు తాజాగా ఈ శుక్ర‌వారం కోలీవుడ్‌లో రిలీజ్ అయిన ఇరుంబుతిరై కూడా హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఆమె హ్యాట్రిక్ కొట్టిన‌ట్ల‌య్యింది. విశాల్‌ సరసన సామ్‌ నటించిన ఇరుంబుతిరై (తెలుగులో ‘అభిమన్యుడు’)  హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో స‌మంత ఆనందంతో ట్వీట్ చేసింది.

 

నాకు ఈ స‌మ్మ‌ర్ మ‌ర్చిపోలేని అనుభూతి మిగిల్చింది. మీ అంద‌రికి నా ధ‌న్య‌వాదాలు..  ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘ఇరుంబుతిరై’.. హ్యాట్రిక్‌! అధికారికంగా ఇప్పుడు నేను ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న అమ్మాయిని’ అని సామ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక వ‌రుస విజ‌యాల‌తో ఉత్సాహంతో ఉన్న స‌మంత ప్ర‌స్తుతం యూట‌ర్న్ రీమేక్‌లో న‌టిస్తున్నారు. 

 

అలాగే ప్ర‌ముఖ కోలీవుడ్ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఆమె నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క ఆమె శివ కార్తికేయన్‌కు జోడీగా ‘సీమరాజ’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కాబోతోంది. మొత్తానికి స‌మంత ఎక్క‌డ కాలు పెడితే అక్క‌డంతా బంగారు మ‌య‌మైపోతోంది.08382411BRKSAM-FILMS2

స‌మంత హ్యాట్రిక్ కొట్టే..సంతోషంలో ట్వీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share