సన్నీ లియోన్ బయోపిక్ ట్రైలర్ రిలీజ్!

July 6, 2018 at 2:49 pm
SUNNY LEON -

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలియోన్ అంటే ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  హాలీవుడ్ ఫోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌’ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది.  ఆ తర్వాత జిస్మ్ 2 సినిమాతో హీరోయిన్ గా శృంగార తారగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా వచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ కి పరిమితం అయ్యింది.  

 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతుంది. బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ జీవితం ఎన్ని ఆటుపోట్లతో సాగిందో మనందరికీ తెలిసిందే. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతో ‘పోర్న్‌స్టార్‌’ ఇమేజ్‌ నుంచి బయటపడగలిగారు. కాగా..సన్నీ లియోనీ జీవితాధారంగా ‘కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’ పేరిట ఓ బయోపిక్‌ రాబోతోంది. 

 

ఈ వెబ్ సిరీస్ లో సన్నీ పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది.   ‘కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’సంబంధించిన ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. సన్నీకి మేకప్ వేస్తున్న సన్నివేశంతో  ట్రైలర్ మొదలవుతుంది.

 

 అనంతరం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టడం, ఫొటో షూట్లు, తల్లిదండ్రులు తిట్టడం, ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలు అడిగిన సన్నివేశాలను చూపించారు. ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.saddun

సన్నీ లియోన్ బయోపిక్ ట్రైలర్ రిలీజ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share