స‌ర్కార్‌ను వ‌ణికిస్తున్న పైర‌సీ ట్వీట్‌..

November 6, 2018 at 11:54 am

ఏఆర్ మురుగుదాస్‌, విజ‌య్ కాంబినేష‌న్‌లో మంగ‌ళ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ర్కార్ సినిమాను పైర‌సీ వ‌ణ‌కిస్తోంది. సినిమా విడుద‌ల అయిన కొద్దిగంట‌ల్లోనే ఈ సినిమా హెచ్‌డీ వ‌ర్షెన్ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తామ‌ని త‌మిళ రాక‌ర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలా సినిమా విడుద‌ల కావ‌డ‌మే ఆల‌స్యం.. అలా దానికి సంబంధించిన స‌న్నివేశాలు ఆన్‌లైన్‌లో, సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డం ఈ మ‌ధ్య స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాల‌జీ అర‌చేతిలో ఉండ‌డంతో సినిమా న‌డుస్తుండ‌గానే.. దానిలోని స‌న్నివేశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాలు నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.44617876_2080148768696619_428658553847283712_n

నిజానికి.. మురుగుదాస్‌, విజ‌య్ కాంబినేష‌న్‌కు త‌మిళంతోపాటు తెలుగులో మాంచి క్రేజీ ఉంది. తుపాకీ, క‌త్తి సినిమాలు ఇక్క‌డ కూడా వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ముఖ్యంగా సౌత్‌లో విజ‌య్‌కి మంచి మార్కెట్ ఉంది. తాజాగా వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌ర్కార్ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్లు ఆనంద‌ప‌డ్డారు. ఇక ఈ సినిమా బంఫ‌ర్ హిట్ కొట్ట‌డం.. కాసుల వ‌ర్షం కురిపించ‌డం ఖాయ‌మ‌ని అనుకుంటున్న త‌రుణంలో త‌మిళ రాక‌ర్స్ చేసిన ట్వీట్‌తో వ‌ణికిపోతున్నారు. ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తామ‌ని బెదిరింపులు రావ‌డంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే.. ఈ ట్వీట్‌తో త‌మిళ ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. థియేట‌ర్ల‌లో సెల్‌ఫోన్ల‌లో, ఇత‌ర కెమెరాల్లో సినిమాను రికార్డు చేయ‌డాన్ని నివారించేందుకు థియేట‌ర్ల య‌జ‌మానులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ మేర‌కు అవ‌స‌రం అయితే.. సిబ్బందిని నియమించుకోవాల‌ని కోరింది. త‌మిళ రాక‌ర్స్‌తో భ‌యం అవ‌స‌రం లేద‌ని.. సినిమాకు ఏం కాద‌ని భ‌రోసా ఇచ్చింది. ఇక గ‌తంలోనూ త‌మిళ రాక‌ర్స్ పేరిట ప‌లు సినిమాలను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ.. అవేవీ ఫ‌లించ‌లేదు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని త‌మిళ ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అంటోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..

స‌ర్కార్‌ను వ‌ణికిస్తున్న పైర‌సీ ట్వీట్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share