కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో శింబు. శింబుకు తెలుగులో కూడా మన్మథ, వల్లభ సినిమాలతో క్రేజ్ వచ్చినా ఆ తర్వాత దానిని నిలుపుకోలేకపోయాడు. ఇక నయనతార-శింబు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలి పెళ్లి వరకు వెళ్లాక వాళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పారు. వీరిద్దరు విడిపోయాక కొన్నేళ్లకు మళ్లీ కలిసి చేసిన సినిమా ఇదు నమ్ము ఆళు. దీనిని తెలుగులో ఈ రోజు సరసుడు పేరుతో రిలీజ్ చేశారు.
ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి ‘ప్రేమ సాగరం’ దర్శకుడు టి.రాజేందర్ మాటలు, పాటలు రాయడం సొంత ప్రొడక్షన్ లోనే నేరుగా తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా చూసిన జనాలు పరమరొటీన్ సినిమా అని పెదవి విరుస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శింబు ఎంతమందిని ప్రేమించినా బ్రేకప్ అవుతుంటాయి. చివరకు పెద్దలు కుదిర్చిన నయనతారను చూసి ప్రేమలో పడడం పెళ్లి వరకు వెళ్లాక వారిద్దరు విడిపోవడం.. వారి మధ్యలోకి మరో హీరోయిన్ ఆండ్రియా ఎంటర్ అవ్వడం, చివరకు శింబు-నయన ఒక్కటవ్వడమే ఈ సినిమా స్టోరీ.
కథలేకుండా రెండు గంటలు కాలక్షేపం చేయించడానికి రాసుకున్న ఈ కథనం చాలా రొటీన్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు చూసేశారు. ఒక రొటీన్ కథకి, ఒక రొటీన్ కథనం తోడైతే సరసుడులాంటి సినిమా రిపీట్ అవుతుంది. ఇటీవల తెలుగులో వస్తోన్న లవ్ స్టొరీ బేస్డ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఈ సినిమా కంటే కొద్దిగా బెటర్ గానే ఉంటున్నాయి. ఓవరాల్ గా సినిమా షార్ట్ ఫిల్మ్ కథతో తీసిన ఓ ఫీచర్ ఫిల్మ్ ఈ సరసుడు.