అర్జున్ రెడ్డితో జర భద్రం

పెళ్లిచూపులు సినిమా త‌ర్వాత నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ టాలీవుడ్‌లో ఓ సంచ‌ల‌నంగా మారాడు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మ‌నోడు మాంచి జోష్‌లో ఉన్నాడు. ఈ యేడాది వ‌చ్చిన ద్వార‌క మూవీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ద్వార‌క త‌ర్వాత విజ‌య్ న‌టించిన అర్జున్‌రెడ్డి రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ నెల 25న థియేటర్ల‌లోకి దిగుతోంది.

కావాల్సిన‌న్ని కాంట్ర‌వర్సీల‌తో అర్జున్‌రెడ్డి మంచి ప‌బ్లిసిటీ తెచ్చుకుంది. అర్జున్‌రెడ్డి లిప్‌లాక్ పోస్ట‌ర్ల‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ వి.హ‌నుమంత‌రావు చింపివేయ‌డం, అందుకు విజ‌య్ చిల్ తాత‌య్యా అని ట్విట్ చేయ‌డం, ఇక రాంగోపాల్ వ‌ర్మ హ‌నుమంత‌రావు బ‌ట్టలు చించుకోవాల‌ని సెటైర్ వేయ‌డం ఇలా ఈ సినిమాపై ముందే పెద్ద కాంట్ర‌వర్సీ క్రియేట్ అయ్యింది.

ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్లు కూడా సినిమాకు హైప్ తెచ్చాయి. ఇక సెన్సార్ క‌ట్స్‌పై విజ‌య్ రెచ్చిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాలో విజ‌య్ ఎంట్రీ సీన్ ఇదేనంటూ ఓ వార్త లీక్ అయ్యింది. డ్రగ్స్‌కు, మ‌ద్యానికి బానిస అయిన విజ‌య్ త‌న ప్లాట్‌లో నిద్ర‌పోతుంటాడు.. అత‌డి ముందు చాలా మద్యం సీసాలు చెల్లచెదురుగా పడిపోయి ఉంటాయి. ఇంతలో సోఫాకి ఓవైపు నుంచి సన్నటి నీటిధార కారుతూ కనిపిపస్తుంది. పొద్దున్నే లేచి టాయిలేట్ కి వెళ్లడానికి కూడా బద్ధకం వేసి సోఫాలోనే మూత్రం పోసే క్యారెక్టర్ అర్జున్ రెడ్డిది అనే వాయిస్ ఓవర్ తో సినిమా మొదలుఅవుతుంది.

ఈ సీన్ గురించి వింటుంటేనే ఈ సినిమాలో విజ‌య్‌ది ఎలాంటి క్యారెక్ట‌ర్‌, సినిమాలో అడ‌ల్ట్‌కంటెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమా కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో నానా ర‌చ్చ చేయ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది. మ‌రి అర్జున్‌రెడ్డి అంచ‌నాలు ఎంత‌మేర అందుకుంటుందో ? చూడాలి.