అందం ఆవిరైన వేళ .. సోనాలి బింద్రే మొఖంపై చిరునవ్వు

September 5, 2018 at 3:45 pm

టాలీవుడ్ లో మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. తన అందాలతో టాలీవుడ్, బాలీవుడ్ను ఊపేసిన సోనాలి ఉన్నట్టుండి ఇలా క్యాన్సర్ బారిన పడటం అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్ లో తనతోటి తారలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వైద్యుల సలహా మేరకు హైగ్రేడ్ క్యాన్సర్కు చికిత్స చేయించుకునేందుకు న్యూయార్క్కు వెళ్తున్నట్లు సోనాలీ బింద్రే తన ట్విట్టర్లో తెలిపిన విషయం తెలిసిందే.05_08_2018-sonali_18282008_13336792

క్యాన్సర్ విషయం తెలియగానే కుటుంబసభ్యులు, సన్నిహతులు తనకు సపోర్ట్ చేశారని తెలిపింది. క్యాన్సర్ నుంచి తాను క్షేమంగా బయటపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పింది సోనాలీ బింద్రే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స క్రమంలో ఆమె జుట్టు పూర్తిగా ఊడిపోయింది. గుండుతో ఉన్న ఫొటోల్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రియాంకా చోప్రా సలహాతో కేశాలంకరణ నిపుణులను కలిసి విగ్గు తీసుకున్నట్లు సోనాలి తాజాగా తెలిపారు. ఈ సందర్భంగా సానాలీ బింద్రే తన మనసులోని మాటలు అభిమానులకు పంచుతూ..ప్రియాంక చోప్రాకు ధన్యవాదాలు తెలిపింది.images

సోనాలీ బింద్రె మాటల్లో..అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు? మనం కనిపించే విధానంపై మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. మనకు ఆనందాన్ని కల్గించే పనులు చేయడం చాలా ముఖ్యం.. అది సింపుల్గా పెట్టుకునే విగ్గు కావొచ్చు, ఎర్రగా వేసుకునే లిప్స్టిక్ కావొచ్చు, హై హీల్స్ ధరించడం కావొచ్చు.. నీకు ఇది మంచి? ఇది చెడు? అని పక్కవారు చెప్పరు. నాకు సరిపడే విగ్గు కోసం చూస్తున్నప్పుడు నాకో అనుమానం వచ్చింది. నేను అందంగా ఉంటేనే సౌకర్యంగా ఫీల్ అవుతానని అర్థమైంది. తలకు స్కార్ఫ్ కట్టుకునే ఉద్దేశం ఉంటే అలానే చేసేదాన్ని. గుండుతో తిరగాలి అనుకుంటే తిరిగేదాన్ని. ఏం చేస్తే సంతోషంగా ఉంటారో కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది కదా.sonali-bendre

నాకు ‘బోకీ హెయిర్’ (విగ్గుల తయారీ సెలూన్) గురించి చెప్పినందుకు ధన్యవాదాలు ప్రియాంకా చోప్రా. వాళ్లు నా కొత్త లుక్ను సృష్టించారు’ అని సోనాలి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఓ వీడియోను, ఫొటోను కూడా షేర్ చేశారు. తాజాగా సోనాలి బింద్రే చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన మనోధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు..త్వరగా కోలుకొని మళ్లీ తెరపై కనిపించాలని అభిమానులు దేవున్ని ప్రార్ధిస్తున్నారు.

అందం ఆవిరైన వేళ .. సోనాలి బింద్రే మొఖంపై చిరునవ్వు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share