‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… రికార్డుల లెక్క‌లు మారాయి

ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ మూవీ రికార్డుల లెక్క‌లు మార్చేస్తోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ల‌తో రికార్డులు కొల్ల‌గొట్టింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఓవ‌ర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. టాక్‌, రివ్యూల‌తో సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఓపెనింగ్స్ కుమ్మేస్తోంది.

ఓ వైపు మ‌హేష్‌బాబు, మ‌రోవైపు స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ఉండ‌డంతో పాటు ఈ సినిమా రెండు భాష‌ల్లో ఏకంగా 800 స్క్రీన్ల‌లో రిలీజ్ అవ్వ‌డంతో అక్క‌డ కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం స్పైడ‌ర్ ఓవ‌ర్సీస్‌లోనే ప్రీమియ‌ర్ల‌తో 9 లక్షల డాలర్లను కలెక్ట్ చేసింది.

ఈ క్ర‌మంలోనే స్పైడ‌ర్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో హయ్యస్ట్ ప్రీమియర్ కలెక్షన్లను సాధించిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది. స్పైడ‌ర్ దెబ్బ‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాలు కూడా కింద‌కు ప‌డిపోయాయి. ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ల ప‌రంగా హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఇవే…

1-బాహుబలి-2 = 24.50 ల‌క్ష‌ల డాల‌ర్లు

2-బాహుబలి-1 = 13.65 

3- ఖైదీ నెం.150 = 12.95 

4-స్పైడర్ = 10.0 (ఇంకా పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది)

5-సర్దార్ గబ్బర్‌సింగ్ = 6.16

6- జై లవకుశ = 5.89