‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ రివ్యూ చ‌దివేయండి ఓ సారి

September 18, 2017 at 12:10 pm
Spyder, Mahesh babu, Review

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సినీ అభిమానుల దృష్టంతా ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాల మీదే ఉంది. ఈ రెండు సినిమాలు సెన్సార్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి. వీటిల్లో జై ల‌వ‌కుశ 21న వ‌స్తుంటే, స్పైడ‌ర్ 27న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఇక మ‌హేష్ స్పైడ‌ర్ సోమ‌వారం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. మ‌హేష్ సీబీఐ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

దుబాయ్‌లో ఇండియ‌న్ సినిమా మ్యాగ‌జైన్ ఎడిట‌ర్‌, ఫిల్మీ క్రిటిక్‌, అక్క‌డ ఇండియ‌న్ సినిమాల సెన్సార్ బోర్డు మెంబ‌ర్ అయిన ఉమైర్ సంధు ఎప్ప‌టి లాగానే స్పైడ‌ర్ ఫ‌స్ట్ రివ్యూ ట్వీట్ రూపంలో ఇచ్చేశాడు. ఈ సినిమా గురించి మ‌రో విశేషం ఏంటంటే స్పైడ‌ర్‌లో మద్యపాన, ధూమపాన సన్నివేశాలు అస్సలు లేకపోవడంతో సినిమాకు ముందు, ఇంటర్వెల్ సమయంలో వార్నింగ్ యాడ్స్‌కు మినహాయింపు ఇచ్చారు.

ఇక ఉమైర్ సంధు రివ్యూ ప్ర‌కారం మ‌హేష్ ఈ సినిమాతో ఓ సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న అక్కౌంట్‌లో వేసుకోవ‌డం ఖాయం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎక్కడా కూడా బోరింగ్ ఎలిమెంట్ లేకుండా సినిమా బాగా వచ్చిందని సంధు చెప్పారు. ఇక సినిమాకు స్క్రీన్ ప్లే చాలా హైలెట్‌గా నిలిచింద‌ని సంధు తెలిపారు. ఓవ‌రాల్‌గా ద‌స‌రాకు మ‌హేష్ సూప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని సంధు తేల్చేయ‌డంతో మహేష్ ఫ్యాన్స్ అప్పుడే ద‌స‌రా సంబ‌రాలు స్టార్ట్ చేసేశారు.

 

‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ రివ్యూ చ‌దివేయండి ఓ సారి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share