‘ స్పైడ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌: ర‌న్ టైం & టాక్ 

September 18, 2017 at 11:24 am
Spyder Movie Sensor talk

ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరో, సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ట‌ర్‌, రూ.120 కోట్ల భారీ బ‌డ్జెట్‌, రూ. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌, మ‌హేష్ త‌మిళ్‌లో ఎంట్రీ ఇస్తోన్న తొలి సినిమా, తెలుగు-త‌మిళ్‌-అర‌బిక్ భాషల్లోను రిలీజ్ అవుతోన్న సినిమా ఇవ‌న్నీ ఏ సినిమా గురించో కాదు… స్పైడ‌ర్ సినిమా గురించే. పైన చెప్పుకున్న లెక్క‌ల‌న్ని చాలు స్పైడ‌ర్ సినిమా ఎలాంటి అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందో…!

మహేష్‌బాబు కెరీర్‌లోనే రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ స్పైడర్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఈ సినిమా దుమ్ము రేపింది. తాజాగా సోమ‌వారం స్పైడ‌ర్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. 2:25 గంట‌లు (145 నిమిషాల నిడివి)తో ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతోంది.

మ‌హేష్‌బాబు స‌ర‌స‌న టాలీవుడ్ గోల్డెన్ గ‌ర్ల్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ తొలిసారిగా ఆడిపాడిన ఈ సినిమాలో తమిళ యాక్టర్స్ ఎస్.జె సూర్య, భరత్‌ విలన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 27న తెలుగు, తమిళ, అరబిక్ భాషల్లో స్పైడర్ మూవీ రిలీజ్ కానుంది. ఇక సినిమా చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు స్పైడ‌ర్‌ను మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే ఓ డిఫ‌రెంట్ ఫిలింగా అభివ‌ర్ణించారు.

సినిమా అంతా థ్రిల్ ఎలిమెంట్స్‌తో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంద‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ టాక్‌తో మ‌హేష్ ఫ్యాన్స్ సంబ‌రాలు షురూ చేసుకుంటున్నారు. ఇక థియేట‌ర్ల‌లో ఈ నెల 27న స్పైడ‌ర్ చూడ‌డం కోసం వెయిట్ చేస్తున్నారు.

 

‘ స్పైడ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌: ర‌న్ టైం & టాక్ 
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share