రిలీజ్‌కు ముందే రికార్డుల ‘ స్పైడ‌ర్‌ ‘

సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ విడుదలకు ముందే పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. 

ఇక ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో స్పైడ‌ర్ రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను రూ 15.5 కోట్ల రూపాయలకు తెలుగు హక్కులను కొనుగోలు చేయగా, 8 కోట్ల రూపాయలకు తమిళ వెర్షన్ హక్కులను టీఎంయూఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకుంది. 

ఇక రెండు భాష‌ల్లో క‌లిపి ఓవ‌ర్సీస్‌లో సినిమాను 850 స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి-2 తర్వాత అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఇక బుకింగ్స్‌తోనే స్పైడ‌ర్ ప‌లు రికార్డులు త‌న అక్కౌంట్‌లో వేసుకుంది. స్పైడ‌ర్‌ ప్రీమియర్ షోలకు ఎన్నారైలు భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రిమియర్ బుకింగ్స్ ద్వారా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.

ఇక మొత్తం ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అయ్యే స‌రికి సులువుగానే 1 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ సులువుగానే క్రాస్ చేస్తుంద‌ని అంటున్నారు. మెగాస్టార్ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ప్రీమియర్ల ద్వారానే 12లక్షల 70వేల 529డాలర్లు (8 కోట్ల 65 లక్షల 54వేల 788రూపాయలు) కొల్లగొట్టింది. ఈ రికార్డును స్పైడర్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఓవర్సీస్ విశ్లేషకులు చెబుతున్నారు.  

మ‌హేష్‌బాబుకు ఓవర్సీస్‌లో మంచి బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. దూకుడు, ఆగడు, బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు.. వంటి సినిమాలన్నీ ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండు భాష‌ల్లో రిలీజ్ అవుతుండ‌డంతో అంచ‌నాల‌కు మించి రికార్డులు సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.