ఆ మాన‌సిక వ్య‌థే శ్రీని అంతం చేసిందా..?

February 27, 2018 at 3:10 pm
sridevi-death

అతిలోక సుంద‌రి మ‌ర‌ణం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గ‌డిచిన రెండు రోజులుగా ఎవ‌రిని ప‌ల‌క‌రించినా ఇవే వార్త‌లు, ఇవే సంగ‌తులు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రిస్థితి దాటి.. అస‌లు శ్రీ మ‌ర‌ణానికి రీజ‌న్ వెతికే ప‌నిలో ప‌డిపోయారు అంద‌రూ. అస‌లు శ్రీదేవి మ‌ర‌ణానికి కార‌ణం ఏంటి?  గుండె పోటు కాద‌ని తేలిపోయింది. బాత్ ట‌బ్‌లో మునిగి చ‌నిపో యార‌ని తాజాగా దుబాయ్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. దీంతో దేవి మ‌ర‌ణం మిస్ట‌రీగా మారింది. అలా ఎందుకు జ‌రుగుతుం ది? అలా కూడా చ‌నిపోవ‌డం సాధ్య‌మేనా? అనే సందేహాలు సైతం వ్య‌క్త‌మ‌వ‌తున్నాయి. ఇక‌,ఈ క్ర‌మంలోనే అన్ని కోణాల్లో నూ దేవి మ‌ర‌ణంపై కూపీ లాగుతున్నారు. కుటుంబ క‌ల‌హాలు ఉన్నాయా? ఆస్తి లావాదేవీలు ఉన్నాయా? అనే కోణంలోనూ దృష్టి పెట్టారు. 

ఈ క్ర‌మంలోనే ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. ఇటు టాలీవుడ్ స‌మా బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యం లో శ్రీదేవి బాగానే కూడ‌బెట్టింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టికే వివాహితుడు, ఓ కుమారుడు కూడా ఉన్న బోనీ క‌పూర్‌ను వివాహం చేసుకుంది. ఈ క్ర‌మంలో త‌న‌ను ప్రేమించాన‌ని వెంట‌ప‌డిన బోనీతో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్న‌ట్టు స‌మాచారం. ‘నీ మొదటి భార్యతో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటేనే మన వివాహ బంధం మొదలవుతుంది’ అని 1996లో పెళ్లి సమయంలో బోనీకి శ్రీదేవి పెట్టిన షరతు. అప్పటికి సరేనన్న బోనీ ఆ తరువాత మళ్లీ తొలి భార్యతో సంబంధాలు కొనసాగించారని, చివరకు శ్రీదేవి కూడా సమాధానపడ్డారని తెలుస్తోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో బోనీ త‌న కుమారుడు అర్జున్‌తో సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. ఇది శ్రీదేవికి స‌హ‌జంగానే ఇష్టం లేదు. 

ఇక‌, దుబాయ్‌లో తాజాగా జ‌రిగిన పెళ్లిలో బోనీకపూర్‌ ఎక్కువగా త‌న మొద‌టి భార్య‌ మోనా పిల్లలు అర్జున్‌ కపూర్‌, అన్షులాలతో గడపడం శ్రీదేవికి నచ్చలేదు. ఆ విషయమే ఆమె బోనీని ప్రశ్నించినట్లు సమాచారం. ‘మీకు అర్జున్‌, అన్షులాలే పిల్లలా? ఖుషీ కాదా?( బోనీ-శ్రీ కుమార్తె) ఆమె ఈ పెళ్లిలో ఏకాకిగా మిగిలిపోయింది.. నా పిల్లలు నీకు పిల్లలు కారా?’ అని నిలదీసినట్లు తెలుస్తోంది. దీనికి బోనీ సూటిగా బదులివ్వలేకపోయారు. ఈ విష‌యంలోనే ఇరువురూ గొడ‌వ ప‌డిన‌ట్టు తెలిసింది. దీంతో బోనీ హ‌ఠాత్తుగా ముంబైకి వ‌చ్చేశారు. మ‌రో రెండు రోజుల త‌ర్వాత దుబాయ్‌కి వెళ్లి శ్రీదేవిని శాంత ప‌ర‌చాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఈ ఘ‌ర్ష‌ణ‌ను శ్రీదేవి మ‌రిచిపోలేక‌పోయార‌ని తెలుస్తోంది. ఆమె మర‌ణానికి రెండు రోజుల ముందు హోట‌ల్ గ‌ది నుంచి బ‌య‌ట‌కు కూడా రాక‌పోవ‌డానికి ఈ ఘ‌ర్ష‌ణే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

దీనికితోడు.. బోనీ ద‌గ్గ‌ర ఇప్పుడు ఉన్న ఆస్తంతా శ్రీదేవిదే. దీంతో ఈ ఆస్తిలో స‌గం పైగా బోనీ త‌న పిల్ల‌ల‌కు ఇచ్చేస్తే.. ప‌రిస్థితి ఏంటి? అని కూడా శ్రీదేవి మాన‌సికంగా కుంగిపోయిన‌ట్టు స‌మాచారం. బోనీ – మళ్లీ అర్జున్‌ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయపడుతూంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపింది.  ఆస్తిని బోనీ- తన తొలి భార్య పిల్లలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోడానికి శ్రీదేవి ఇష్టపడడం లేదు. 

జాహ్నవి, ఖుషీల భవిష్యత్తును అందంగా తీర్చిది ద్దాలని ఆరాటపడింది. జాహ్నవి తొలి సినిమా ధడక్‌ ను ఖరారు చేసి సెట్స్‌ దాకా తీసికెళ్లింది కూడా శ్రీదేవే. ఈ క్ర‌మంలోనే తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన‌ట్టు తెలుస్తోంది. ఈ మాన‌సిక వేద‌న‌తో ఆమె మ‌ద్యం తీసుకుందా?  ఈక్ర‌మంలోనే ప్రాణాల మీదికి తెచ్చుకుందా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు సాగుతున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. శ్రీదేవి మృతి మిస్ట‌రీ ఇప్ప‌ట్లో వీడేలా క‌నిపించ‌డం లేదు.

ఆ మాన‌సిక వ్య‌థే శ్రీని అంతం చేసిందా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share