సునీల్ ఫిర్యాదు సుప్రీం షాక్..శ్రీదేవి మృతిపై 240 కోట్ల రగడ రగడ

May 12, 2018 at 12:45 pm
sridevi-death-insurence

 

అందాల తార శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్ లో జుమైరా ఎమిరేట్స్ టవర్స్ లో బాత్ టబ్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని దీనిపై విచారణ జరిపించాలని సుప్రీంను ఆశ్రయించాడు. అయితే సుప్రీం ఈ పిటీషన్ ను తిరస్కరించింది. గతంలో ఇలాంటి పిటీషన్లు చాలా వచ్చాయని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేమని సుప్రీం చెప్పింది.

 

సునీల్ సింగ్ తన పిటీషన్ లో శ్రీదేవి మరణం చాలా అనుమానాలకు దారి తీస్తుందని 5.7 అడుగులు ఉండే శ్రీదేవి 5 అడుగుల బాత్ టబ్ లో ఎలా మునిగి చనిపోతారని పిటీషన్ లో రాసుకొచ్చారు. అంతేకాదు శ్రీదేవి పేరు మీద 240 కోట్ల భీమా కూడా ఉన్నట్టు ఆయన ప్రస్థావించారు. ఒమన్ దేశంలో చేయించిన పాలసీ కాబట్టి దుబాయ్ లో మరణిస్తేనే ఆ పాలసీ ఎన్ క్యాష్ చేసుకునే అవకాశం ఉందని పిటీషన్ లో రాసుకొచ్చారు. అయితే సుప్రీం మాత్రం సునీల్ సింగ్ పిటీషన్ ను విచారణ జరుపలేమని చెప్పింది.

సునీల్ ఫిర్యాదు సుప్రీం షాక్..శ్రీదేవి మృతిపై 240 కోట్ల రగడ రగడ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share