శ్రీదేవిపై ఇన్సూరెన్స్ ఎన్ని కోట్లో తెలుసా… స‌రికొత్త సందేహం

February 28, 2018 at 11:12 am
sridevi-insurence

శ్రీదేవి మృతి త‌ర్వాత త‌వ్వే కొద్ది కొత్త విష‌యాలు, కొత్త సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. శ్రీదేవి భౌతిక‌కాయం గ‌త‌రాత్రి ముంబై వ‌చ్చే వ‌ర‌కు దుబాయ్‌లో జ‌రిగిన సీన్లు పెద్ద థ్రిల్ల‌ర్ సినిమానే త‌ల‌పించాయి. ఇక శ్రీదేవి మృతిని దుబాయ్ ఫోరెన్సిక్ వాళ్లు కూడా స‌హ‌జ మ‌ర‌ణంగానే తేల్చేశారు. ఇక తాజాగా శ్రీదేవి మృతి త‌ర్వాత ఆమె ఆస్తి పాస్తుల‌పై కూడా పెద్ద ర‌గ‌డ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు  శ్రీ‌దేవిపై ఏకంగా రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఉంద‌న్న‌ది తాజా వార్త‌. స్టార్ డ‌మ్ ఉన్న న‌టీన‌టులు, ప్ర‌స్తుతం రేసులో ఉన్న వాళ్లు ఈ స్థాయిలో ఇన్సూరెన్స్ చేయించుకోవ‌డం కామ‌న్‌. ఇక ఇటీవ‌ల శ్రీదేవి పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. ఇటీవ‌ల కాలంలో ఒక‌ట్రెండు సినిమాలోనే నెట్టుకొస్తోంది. మ‌రి ఇలాంటి టైంలో శ్రీదేవి రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఎలా చేయించుకుంటుంద‌న్న కొత్త డౌట్ అంద‌రిలోనూ రైజ్ అవుతోంది.

శ్రీదేవి మృతి త‌ర్వాత దుబాయ్ పోలీసులు ఆమె భ‌ర్త బోనీక‌పూర్‌ను రెండు మూడు సార్లు విచారించారు. ఈ క్ర‌మంలోనే వాళ్లు శ్రీ‌దేవి తాలుకూ మెడిక‌ల్ రిపోర్టులు, ఆస్తి పాస్తుల వివ‌రాలు దుబాయ్ పోలీసులు సేక‌రించారు. అందులో భాగంగానే రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింద‌ని తెలుస్తోంది. ఏదేమైనా 54 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో శ్రీదేవిపై రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఇప్పుడు స‌రికొత్త సందేహాల‌కు తావిచ్చేలా ఉంది. 

శ్రీదేవిపై ఇన్సూరెన్స్ ఎన్ని కోట్లో తెలుసా… స‌రికొత్త సందేహం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share