జెన్నిఫ‌ర్ లోపేజ్ బెడ్‌పై శ్రీ‌నువైట్ల‌..!

November 10, 2018 at 11:22 am

జెన్నిఫ‌ర్ లోపెజ్ బెడ్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల‌.. షూటింగ్ జ‌రిగిన ఇర‌వై రోజులూ ఆయ‌న అక్క‌డే ప‌డుకున్నాడ‌ట‌. ఆమె బెడ్‌పై ఈయ‌నెందుకు ఉన్నాడ‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. మీరు చ‌దివింది నిజ‌మే. అస‌లేం జ‌రిగింది..? ఆ వివ‌రాలేమిటో తెలుసుకోవాల‌ని ఆత‌`త‌గా ఉందా..! అయితే మీరు ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి. ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల ర‌వితేజ హీరోగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా ఈనెల 16న విడుద‌ల కానుంది. అయితే.. ఈ చిత్రంలో పిల్ల‌ల ఎపిసోడ్‌ను చిత్రీక‌రించేందుకు శ్రీ‌నువైట్ల నిర్ణ‌యించ‌కున్నాడు. అదికూడా అమెరికాలో ద‌ట్ట‌మైన ఐస్‌లో మంచు కురుస్తుండ‌గా ఈ పిల్ల‌ల‌తో షూటింగ్ చేయాల‌ని అనుకున్నాడు.Photo © 2015 Target Press/The Grosby Group 01, December 2015.- Hollywood star Jennifer Lopez wears her JLO by Jennifer Lopez clothing new collection

`నేను జెన్నిఫర్‌ లోపేజ్‌కి పెద్ద ఫ్యాన్‌ని. లాంగ్‌ ఐల్యాండ్‌లో ఆమె మేన్షన్‌లో దాదాపు 20 రోజులున్నాను. ఆమె బెడ్‌ మీద పడుకుని నిద్రపోయాను. ఆమె తర్వాత ఆ ప‌క్క‌ మీద పడుకున్నది నేనే. సినిమాలో ఈ పిల్ల‌ల ఎపిసోడ్‌ ప్రధాన కథకు సమాంతరంగా సాగుతుంది. వెంటనే వింటేజ్‌ హౌస్‌లకోసం వేట మొదలుపెట్టాం. యూఎస్‌లో అలాంటి భవనాలు ఉండవు. ఎక్కువగా యూరోప్‌లో ఉంటాయి. అక్కడ తీసి, ఇక్కడ జత చేద్దామా? అనే ఆలోచనలు కూడా మొదలయ్యాయి. అయితే అంతలోనే తెలిసిన వ్యక్తి ఒకరు ఒక ఇల్లు చూపించారు. `ఇది చూడండి సార్‌. ఫార్టీస్‌ మేన్షన్‌ ఇది’ అని అన్నారు. నిజంగా అది చూడగానే షాక్‌ అయ్యా.Jennifer-jennifer-lopez-6705863-1024-768

అయితే.. ఆ ఇల్లు జెన్నిఫ‌ర్ లోపేజ్‌ది అని తెలియ‌గానే శ్రీ‌నువైట్ల షాక‌య్యాడ‌ట‌. `దాదాపు ఎనిమిది, తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉన్న ప్రదేశమది. ఔట్‌హౌస్‌, మెయిన్‌ హౌస్‌, అక్బర్‌ పాత్రకు సంబంధించిన చిన్న ఇల్లు.. అన్నీ ఆ కాంపౌండ్‌లోనే ఉన్నాయి. దాంతో అక్కడే 20 రోజులు షూటింగ్‌ చేశాం. చిత్రీకరణ జరిగినన్నాళ్లూ యూనిట్‌ మొత్తం అక్కడే ఉన్నాం. నిర్మాతలు అక్కడే వసతులను కల్పించారు` అని శ్రీ‌నువైట్ల చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే.. జెన్నిఫ‌ర్‌లోపేజ్ అమ్మ‌గా తెలుగు వ్య‌క్తి మ‌ల్లారెడ్డిగారు కొన్నార‌ట‌. `ఆమె ఇంటిని కొన్న తర్వాత మల్లారెడ్డిగారు కూడా ఇంకా అక్కడికి షిఫ్ట్‌ కాలేదు. నేను మాత్రం ఆమె బెడ్‌రూమ్‌లోనే పడుకునేవాడిని` అని శ్రీ‌నువైట్ల త‌న ఆనందాన్ని పంచుకున్నారు.

జెన్నిఫ‌ర్ లోపేజ్ బెడ్‌పై శ్రీ‌నువైట్ల‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share