టాలీవుడ్ డైరెక్ట‌ర్ల ర్యాంకులు మారాయ్‌

April 26, 2018 at 10:41 am
directors-ranks

టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అని ప్ర‌శ్నించుకుంటే అంద‌రి నోటా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి పేరే వినిపిస్తోంది. అత‌డు ఎంచుకున్న క‌థ‌, క‌థ‌నాలు ఎలాంటివి అన్న‌వి ప‌క్క‌న పెట్టేస్తే బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి పేరు ఇండియా దాటేసి అంత‌ర్జాతీయంగా మార్మోగింది. ఓ విధంగా చెప్పాలంటే ఇండియాలోని టాప్ డైరెక్ట‌ర్ల‌కే స‌వాల్ విసిరి రాజ‌మౌళి జాతీయ స్థాయిలో ఓ గ్రేట్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు.

 

రాజ‌మౌళి త‌ర్వాత ప్లేస్ టాలీవుడ్‌లో ఏ డైరెక్ట‌ర్‌కు ద‌క్కుతుంద‌ని ప్ర‌శ్నించుకుంటే నిన్న‌టి వ‌ర‌కు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కే ఎక్కువ మంది ఓటేసేవారు. అయితే అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఆ లెక్క‌లు మారిపోయాయ్‌. రాజ‌మౌళి త‌ర్వాత ఈ ప్లేస్ ఎవ‌రిది అన్న దానిపై టీ టౌన్లో ఎప్ప‌టి నుంచో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ్‌. త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సుకుమార్, వి.వి.వినాయక్ ఇలా బోల్డన్ని పేర్లూ తెరపైకొచ్చాయి. 

 

అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసితో ఈ ప్లేస్ నుంచి అవుట్ అయితే మిగిలిన డైరెక్ట‌ర్ల‌ను ప‌క్క‌కు నెట్టేసి కొర‌టాల శివ ఈ ప్లేస్‌లోకి వ‌చ్చేశాడు. తీసిన నాలుగు సినిమాలతో జనాలను మెప్పించిన కొరటాల శివని నంబర్ 2గా డిసైడ్ చేశాయి. రంగ‌స్థ‌లంతో ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సుకుమార్‌ను చాలా మంది లైక్ చేయ‌రు. సుకుమార్ సినిమాలు చాలా మందికి అర్థం కావ‌న్న టాక్ ఉంది. 

 

ఇక బోయ‌పాటి ఊర‌మాస్‌… సినిమాను మాస్‌, అండ్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్లో హిట్ కొట్టేస్తాడు. ఇక వినాయక్ హిట్ కొట్టి చాలా రోజులైంది. ఇక కొరటాల మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ తాజాగా భ‌ర‌త్ అనే నేను సినిమాల‌తో సూప‌ర్ హిట్లు కొట్ట‌డంతో కొరటాల శివ టాప్-2లోకి వచ్చేశాడు. కొర‌టాల ఎంచుకుంటోన్న క‌థ‌, క‌థ‌నాలు ఆ క‌థ‌ల‌కు హీరోలను సెట్ చేస్తోన్న విధానం ప్రేక్ష‌కుల‌కు అమితంగా న‌చ్చుతోంది. ఇప్పుడు కొర‌టాల సినిమాలు అంటే ట్రేడ్ వ‌ర్గాల్లో కూడా మంచి న‌మ్మ‌కం క‌లుగుతోంది. 

టాలీవుడ్ డైరెక్ట‌ర్ల ర్యాంకులు మారాయ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share