ఆర్.ఆర్.ఆర్. ప్రాజెక్ట్ లో హీరోయిన్లు పేరు లీక్!?

November 5, 2018 at 6:49 pm

భారతీయ చలన చిత్ర రంగంలో దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’సీరిస్ జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా రికార్డుల మోత మోగించింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా పొందలేదు. ఆ మద్య నాని హీరోగా తెరకెక్కించిన ‘ఈగ’సినిమాలో ఉపయోగించిన టెక్నాలజీ, కాన్సెప్ట్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ప్రభాస్, రానా నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.rgvs-shocking-comments-on-rajamouli-jr-ntr-ram-charan

బాహుబలి 2 తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కి సిద్దం అయ్యారు. ‘ఆర్ ఆర్ ఆర్’అంటే రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ అని అర్థం. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ మొత్తం అయిపోయినప్పటికే.. ఇందులో ఇద్దరు హీరోల కోసం కావాల్సిన ముగ్గురు హీరోయిన్ల వెతుకులాట మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటికే పలువురి హీరోయిన్ల పేర్లు నోటీసులోకి తీసుకున్నా..పేర్లు మాత్రం ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఈనెల 11న పదకొండు గంటల 11 నిమిషాలకు మొదటి షెడ్యూల్ మొదలవుతుందని పేర్కొన్నారు. 540762-deepika-priyanka1

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ అంటే సామాన్య విషయం కాదు. ఇప్పటికే మల్టి-లింగువల్ ప్రాజెక్టుగా దేశమంతా మారుమోగిపోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’కి సంబంధించిన వార్త ఏదైనా సంచలనంలా మారింది. ఈ సినిమా షూటింగ్ ముహుర్తానికి ప్రత్యేక అతిథిగా ప్రభాస్ విచ్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేరోజు ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా వెల్లడిస్తారన్న ఊహాగానాలతో పాటే.. ఆ ముగ్గురూ వీరేననే లీక్డ్ న్యూస్ కూడా వచ్చేసింది. అంతే కాదు అందులో ఇద్దరు బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకోనె లు కాగా..మరో పాత్ర కోసం హాలీవుడ్ గ్లామర్ స్టార్ ని సెలక్ట్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నా..వాస్తం ఏంటో ఈ నెల 11 వరకు ఎదురు చూడాల్సిందే.

ఆర్.ఆర్.ఆర్. ప్రాజెక్ట్ లో హీరోయిన్లు పేరు లీక్!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share