వాళ్ల‌కు రాజ‌మౌళి మాటే మంత్రం..!

November 10, 2018 at 3:15 pm

వాళ్లు అగ్ర‌హీరోలే కావొచ్చు. ఎంత ఇమేజ్ అయినా ఉండొచ్చు. కానీ వాళ్ల‌కు మాత్రం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాటే మంత్రం. ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న ఏదంటే అది. ఇక అంతే.. దానికి తిరుగుండ‌దు. ఇంత‌కీ ఎవ‌రా హీరోలు అని అనుకుంటున్నారా..? వారు మ‌రెవ‌రో కాదు ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌. వీరితో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇక్క‌డ మ‌న హీరోలు జ‌క్క‌న్న‌ను ఇంత‌లా న‌మ్మ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తుందంటే.. అక్క‌డ హీరోల గురించి ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడుకోరు. అంతా మ‌న జ‌క్క‌న్న చుట్టూనే తిరుగుతుంది. ssrajamouli

అలాగ‌ని.. హీరోల ఇమేజ్‌కేమ‌న్నా దెబ్బా అంటే అదికూడా కాదు. ఆ ఇమేజ్ ఎన్నో రెట్లు పెరుగుతుంది.. మార్కెట్ అమాంతంగా ఆకాశం అంచుల్ని తాకుతుంది. అందువ‌ల్లే ఆయ‌నతో సినిమా అంటేనే ఓ బంగారు అవకాశంగా భావిస్తారు హీరోలు. అందుకే రాజమౌళి తీస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి ఎన్టీఆర్‌గానీ, రాంచ‌ర‌ణ్ గానీ ఏం మాట్లాడరు. ఎలాంటి ప్రశ్నలు, అనుమానాలుగానీ లేవు. రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు సెట్‌లో హాజరు కావడమే వారి అని చెప్పొచ్చు. చివరకు ఇద్దరికీ పారితోషికం కూడా లేదు. లాభాల్లో వాటా మాత్రమే. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే..ఈ చిత్రాన్ని ఇద్దరూ కూడా లాభాపేక్షతో చేయకపోవడం. DVV-Danayya-hits-jackpot

అలాగే ఈ సినిమా నిర్మాత దానయ్య కూడా పేరుకి మాత్రమేనట. రాజమౌళి అడిగిన వనరులు సమకూర్చడం మినహా అతను చేసేదేమీ లేదట. రాజమౌళి ఏమి తీస్తాడో, ఎక్కడ తీస్తున్నాడో .. ఇలా ఏ విషయాలు కూడా దానయ్యకు తెలియవట. అయితే.. ఇక్కడ మరో విషయం.. బాహుబలి లాంటి సినిమాలతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఊపు ఊపిన జక్కన్న అందరినీ పక్కన పెట్టి ఎన్టీఆర్, రాంచరణ్ లను ఎంచుకుని ఈ సినిమా తీస్తుండడం గమనార్హం. అంటే.. రాజమౌళి పై వీళ్లకు ఎంత నమ్మకం ఉందో.. వీళ్లపైనా ఆయనకు అంతే నమ్మకం ఉందన్నమాట. ఏదేమైనా ఇక్కడ దానయ్యది మాత్రం లక్కేనని చెప్పాలి. ఎందుకంటే.. ఎప్పుడో రాజమౌళికి అడ్వాన్స్‌ ఇచ్చి వున్న కారణంతో ఈ అదృష్టాన్ని దానయ్య అదృష్టం దక్కించుకున్నాడు.

వాళ్ల‌కు రాజ‌మౌళి మాటే మంత్రం..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share