ప‌వ‌న్ ‘ అజ్ఞాత‌వాసి ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా..

October 13, 2017 at 6:13 am

టాలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాలు బిజినెస్ ప‌రంగా షాక్ ఇస్తున్నా డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్లు మాత్రం మళ్లీ పెద్ద సినిమాల‌తోనే రిస్కీ గేమ్ ఆడుతున్నారు. ఈ విష‌యంలో వారు ఏ మాత్రం వెన‌క్కుత‌గ్గ‌డం లేదు. తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా చుక్క‌ల్లోనే న‌డుస్తోంది.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్ష‌న్ రైట్స్ రూ.100 కోట్ల‌ను సులువుగా దాటేసేలా ఉంది. నైజాం రైట్స్‌ను దిల్ రాజు ఏకంగా రూ.29 కోట్ల‌కు సొంతం చేసుకున్నాడ‌ని టాక్‌. ఈ డీల్‌పై ఒప్పందం దాదాపు పూర్త‌యిన‌ట్టే. ఇక కోస్తాలో కీల‌క‌మైన ఈస్ట్ గోదావ‌రి రైట్స్‌ను రూ. 8 కోట్ల రేంజ్‌లో అమ్మార‌ట‌. ఈ జిల్లాలో రూ. 8 కోట్లు అంటే చాలా చాలా ఎక్కువ. మెగాస్టార్ చిరు ఖైదీ నెంబ‌ర్ 150 లాంగ్ ర‌న్‌లో రూ. 8 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఇక కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ అయినా కూడా రూ 5.5 కోట్లు కొల్ల‌గొట్టింది. దీనిని బ‌ట్టి ఈ జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ మెగా ఫ్యామిలీ సినిమాల‌కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఈ క్రేజ్‌ను బ‌ట్టి అజ్ఞాత‌వాసిని డిస్ట్రిబ్యూట‌ర్లు రూ. 8 కోట్ల‌కు కొన్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇందులో 50 శాతం వాటాను వేరే వాళ్ల‌కు రూ 4.5 కోట్ల‌కు మ‌ళ్లీ అమ్మార‌ట‌. ఓవ‌రాల్‌గా చూస్తే ఈస్ట్‌లో అజ్ఞాత‌వాసి సేఫ్ జోన్‌లోకి రావాలంటే రూ. 10 కోట్ల షేర్ కొల్ల‌గొట్టాలి.

 

ప‌వ‌న్ ‘ అజ్ఞాత‌వాసి ‘ బిజినెస్ ఈ రేంజ్‌లోనా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share